కరోనా మరోసారి విజృంభిస్తోంది. ప్రపంచ దేశాల్లో తన సత్తా చూపిస్తోంది. చైనా, జపాన్, అమెరికా, కొరియా వంటి దేశాలు కరోనా గుప్పిట్లో విలవిల్లాడుతున్నాయి. అందుకే.. ఇప్పుడు ఇండియా కూడా అలెర్ట్ అవుతోంది. ఇప్పటికే ఇండియాలో ఒమిక్రాన్ బీఎఫ్‌ 7 వేరియంట్ కేసులు నాలుగైదు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది.

ఇందులో భాగంగా ఇవాళ రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కేంద్ర మంత్రి మాండవీయ సమావేశం నిర్వహించబోతున్నారు. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి దృష్ట్యా ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది. కరోనా వ్యాప్తిని కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందన్న కేంద్రమంత్రి మాండవీయ అవసరమైన చర్యలు కేంద్రం చేపడుతోందని తెలిపారు. ఈ మీటింగ్‌లో ఇప్పటికే అనుమతి పొందిన ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్‌ విషయంపై చర్చించే అవకాశం ఉంది. ఈ ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సీన్‌ను ప్రజలకు చేరువ చేసే అంశంపై చర్చించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: