ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికైనా తెలంగాణ వారికి సీఎస్‌గా అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. ఇప్పటి వరకు ఆయనకు అనుకూలంగా పని చేసిన వారికే పోస్టింగ్‌లు ఇస్తున్నారని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. తాము మొదటి నుంచి సోమేశ్‌కుమార్‌ ప్రధాన కార్యదర్శిగా నియామకాన్నివ్యతిరేకిస్తున్నామని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, వి.హనుమంతురావు, కిసాన్‌ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అంటున్నారు.


టాప్ 15 ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంతా బీహార్‌కు చెందిన వారే ఉన్నారని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. ఇవాళ, రేపు నూతన ఇంచార్జి మానిక్ రావు థాక్రే హైదరాబాద్‌లో ఉంటారని పార్టీ నాయకులతో వరుస సమావేశాలు ఉంటాయని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు. పీఏసీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ, డీసీసీ నేతలతో, వివిధ కమిటీ లతో సమావేశం అవుతారని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు. రెండో రోజున అనుబంధ సంఘాల నేతలతో కూడా సమావేశం అవుతారని కాంగ్రెస్‌ నాయకులు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: