ఏపీ సీఎం జగన్‌కు ఉద్యోగులు మరోసారి వార్నింగ్ ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కరం కోసం ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఆందోళన చేపడతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్ సూర్య నారాయణ అంటున్నారు. ఉద్యోగుల పట్ల జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఉద్యోగ సంఘ నేతలు ఏపీ గవర్నర్ ను కలిసి వినతిపత్రం అందించారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు నిస్సహాయ స్థితిలో ఉన్నారని కె.ఆర్ సూర్య నారాయణ  వాపోయారు. 90 వేలమంది ప్రభుత్వ ఉద్యోగుల అనుమతి లేకుండా వారి ఖాతాల నుంచి ప్రభుత్వం డబ్బులు తీసుకుందని కె.ఆర్ సూర్య నారాయణ అంటున్నారు.  ఇదేమని అడిగితే తిరిగి ఇస్తామని చెపుతున్నారు తప్ప ఇవ్వడం లేదని కె.ఆర్ సూర్య నారాయణ  పేర్కొన్నారు.


ప్రభుత్వం తాను ఏర్పాటు చేసిన నిబంధనలను ప్రభుత్వమే ఉల్లంఘిస్తుందని కె.ఆర్ సూర్య నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ధికశాఖ అధికారులు, మంత్రి వర్గ ఉప సంఘం, ప్రభుత్వ సలహాదారులకు అందరికి ఉద్యోగుల సమస్యలు చెప్పామని వారు స్పందించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో గవర్నర్ ని కలిసి ఫిర్యాదు చేశామని కె.ఆర్ సూర్య నారాయణ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: