తెలంగాణ గిరిజన సంక్షేమ మోడల్ క్రీడా పాఠశాలల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. ఔట్ సోర్సింగ్ పద్దతి ద్వారా కోచ్ ల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేష్‌ ఇచ్చింది. కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని, కాచనపల్లి, మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడలోని పాఠశాలల్లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. అక్కడ ఖాళీగా ఉన్న కబడ్డీ, వాలీబాల్, హ్యాండ్ బాల్ కోచ్‌లను 2022-23 సంవత్సరానికి నియమించడానికి నోటిఫికేషన్  వచ్చింది.


ఈ పోస్టులకు ఎన్‌ఎస్‌ ఎన్‌ఐసీ డిప్లొమా కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులని నోటిఫికేషన్  తెలిపింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ఫారాలను tstribalwelfare.cgg.gov.in వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలని నోటిఫికేషన్  తెలిపింది. దరఖాస్తు ఫారాలను తమ రెజ్యూమెతో పాటు sportsofficertwd@gmail.com మెయిల్ చేయాలి. లేనిపక్షంలో అకడమిక్ సెల్, కమిషనర్ కార్యాలయము, గిరిజన సంక్షేమ శాఖ, డీఎస్‌ఎస్ భవన్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్ నందు సమర్పించవచ్చు.  దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 30 చివరి తేదీ. వివరాలకు9908550250, 9247267050 నెంబర్లకు ఫోన్ చేయొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: