కందుకూరు తొక్కిసలాటపై విశ్రాంత న్యాయమూర్తి శేష శయనా రెడ్డి కమిషన్ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కందుకూరు తెలుగుదేశం నేతలు ఇంటూరి నాగేశ్వరరావు, ఇంటూరి రాజేష్ లను శేష శయనా రెడ్డి కమిషన్ విచారణకు పిలిచింది. ఇవాళ ఉదయం 11గం.కు విజయవాడలోని ప్రభుత్వ అతిథి గృహంలో విచారణకు రావాలని నేతలకు శేష శయనా రెడ్డి కమిషన్ నోటీసులు పంపింది.


కమిషన్ ముందు ఇవాళ సదరు నేతలు  విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే గుంటూరు తొక్కిసలాట ఘటనపై విచారణ చేపట్టిన ఏక సభ్య కమిషన్.. విచారణ అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. జస్టిస్ శేష శయనా రెడ్డి కమిషన్ అధ్యక్షత విచారిస్తున్న ఈ కమిషన్‌ నివేదిక కీలకం కానుంది. జీవో నెంబర్-1ను రద్దు చేయాలనే డిమాండ్లు వస్తున్న సమయంలో జస్టిస్ శేష శయనా రెడ్డి కమిషన్ కీలకమని జగన్ ప్రభుత్వం కూడా భావిస్తోంది. మరి ఈ శేష శయనా రెడ్డి కమిషన్ ఏం తేలుస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: