హైదరాబాద్ కూకట్‌పల్లిలో కళ్లు చెదిరే ఆధ్యాత్మిక కేంద్రం రాబోతోంది. కూకట్ పల్లిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉదాసీన్ మఠ్ పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక, విద్యా కేంద్రాన్ని నిర్మించనుంది. కూకట్ పల్లి వై జంక్షన్ లో 540 ఎకరాల్లో ఉదాసీన్ మఠ్ ఈ కేంద్రాన్ని నిర్మించేందుకు ప్లాన్‌ రెడీ చేసింది. ఉదాసీన్ మఠ్ అధ్యక్షుడు మహంత్ రఘు ముని ఆధ్వర్యంలో హైదరాబాద్ నిర్వాహకులు రామకృష్ణ దంపతులు లాంఛనంగా దీనికి భూమి పూజ, శంకుస్థాపన చేశారు.


ఉదాసీన్‌ మఠం ఆధ్వర్యంలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం శాంతినివాస్, వేద పాఠశాల, యాగశాల, గోశాలతో సహా ప్రజలకు ఉపయోగపడే అనేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్థలం గతంలో కోర్టు వివాదంలో ఉంది. ఇటీవల సుప్రీంకోర్టు 540 ఎకరాలు ఉదాసీన్ మఠ్ కు చెందినవేనని తీర్పు ఇవ్వడంతో వై జంక్షన్ లోని భూములు స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఉదాసీన్ మఠ్ ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మించేందుకు భూమి పూజ నిర్వహించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: