రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లు చెప్తుంది. అందుకు కారణం కూడా లేకపోలేదు.. ఈ ఏడాది కరోనా కారణంగా రైతులు అప్పు ఊబిలోకి కూరుకుపోయారు. అందులోనుంచి బయటకు తీసుకురావడానికి కేంద్రం కొత్త ఆలోచనలు చేస్తుంది. ఇప్పటికే పీఎం కిసాన్ పేరుతో రుణాలను ఇస్తూ వస్తుంది. రుణ సాయం కింద ఏకంగా 10 వేల ఆర్ధిక సాయాన్ని అందిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు మరో కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు.


పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ తీసుకువచ్చింది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి ఏడాది రూ.6,000 లభిస్తాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడతల వారీగా బ్యాంక్ ఖాతాల్లోకి వస్తాయి. రైతులకు సంవత్సరానికి మూడు విడతల్లో రూ.2 వేలు అందుతాయి.ఇప్పటికే 7 విడతల డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు 8వ విడత డబ్బులు అందించేందుకు రెడీ అవుతోంది. మార్చి నెలలో ఈ డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి చేరొచ్చని తెలుస్తోంది. నివేదికలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి...


అయితే అందరికీ ఈ  రుణ సాయం అందదు.. అర్హులైన వారికి ఈ సాయం అందుతుంది. ఒక లిస్ట్ ప్రకారం రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి..వాటి లిస్ట్ లో మి పేరు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలంటే..దీని కోసం మీరు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. మీకు ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి బెనిఫీషియరీ లిస్ట్ ఆప్షన్ ఎంచుకోవాలి.ఇప్పుడు మీ రాష్ట్రం, జిల్లా, ఊరు పేరు ఎంటర్ చేసి మీ పేరు లిస్ట్‌లో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీరు పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరి ఉండకపోతే.. ఇప్పుడు కూడా ఆన్‌లైన్‌లోనే ఈ పథకంలో చేరొచ్చు. దీని కోసం మీ బ్యాంక్ అకౌంట్, పొలం పాస్‌బుక్, ఆధార్ కార్డు వంటి డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: