కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఉద్యో గులు ఇల్లు వదిలి బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఉద్యోగం కన్నా ప్రాణం ముఖ్యం అనే దోరణిలో ఉన్నారు. మరో వైపు ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఉద్యోగుల ఆరోగ్య రీత్యా ప్రభుత్వం కూడా పని వేళలను కుదించింది. అత్యవసర సేవలను అందించే బ్యాంకులకు కూడా ఇదే కొనసాగిస్తున్నారు. బ్యాంకులను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తెరువాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సూచించింది. అంటే, ఇప్పుడు బ్యాంకులు సాధారణ ప్రజలకు 4 గంటలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.


కరోనా మార్గదర్శకాలను పాటించాలని అన్ని రాష్ట్ర స్థాయి బ్యాంకింగ్ కమిటీలను ఐబీఏ కోరింది. కరోనా పరిస్థితుల్లో సాధారణ స్థితి వచ్చే వరకు ఈ విధానం అమలులో ఉంటాయని పేర్కొన్నారు.

ఐబీఏ మార్గదర్శకాలు ఇవే..

అన్ని బ్యాంకులను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తెరువాలి.

బ్యాంకింగ్‌లో కేవలం నాలుగు రకాల సేవలనే అందించాలి. ఇందులో నగదు డిపాజిట్లు, నగదు ఉపసంహరణలు, చెక్కుల క్లియరింగ్, చెల్లింపులు, ప్రభుత్వ లావాదేవీలు ఉన్నాయి.

ఎట్టి పరిస్థితిలోనూ అన్ని బ్యాంకులను సాయంత్రం 4 గంటలకు మూసివేయాలి.

కరోనా సమయంలో 50 శాతం ఉద్యోగులను మాత్రమే బ్యాంకుకు పిలుస్తారు.

ఇతర ఉద్యోగులు పనులను ఇంటి నుంచి చేసుకోవాలి.

షిఫ్ట్ ల ప్రకారం ఉద్యోగులను పిలవాల్సి ఉంటుంది.

ఇకపోతే బ్యాంకింగ్ సేవలకు సంబంధించి జిల్లా యంత్రాంగం ఏ నిర్ణయం తీసుకున్నా అది చెల్లుతుంది.

రాష్ట్ర స్థాయి కమిటీ జిల్లాల వారీగా పరిస్థితులను పర్యవేక్షించి, అదనపు సేవలను అందుబాటులోకి తీసుకు రావాలి.


ఈ కరోనా దృష్ట్యా మే నెలలో బ్యాంకులకు 12 రోజుల సెలవులు ఉన్నట్లు ప్రకటించారు.మే 1 మహారాష్ట్ర దినోత్సవం / మేడే. మేడే రోజున కొన్ని రాష్ట్రాల బ్యాంకులను మూసివేస్తారు. మరుసటి రోజు ఆదివారం యధావిధిగా బ్యాంకులకు సెలవుదినం. 7 వ తేదీన జమాతుల్ విద సందర్భంగా బ్యాంకులకు సెలవు. మరుసటిరోజు రెండో శనివారం, ఆ మరుసటి రోజు ఆదివారం యధావిధిగా సెలవులు ఉంటాయి. 13 న ఈదుల్ ఫితర్‌, 14 న రంజాన్‌, 16 ఆదివారం, 22 నాలుగో శనివారం, 23 ఆదివారం, 26 బుద్ధపూర్ణిమ, 30 ఆదివారం సెలవులు ఉండనున్నాయి. మొత్తానికి చూస్తే బ్యాంకులకు సంబంధించిన పని ఏదైనా ఉంటే ఇప్పుడే చూసుకోవడం మేలు..


మరింత సమాచారం తెలుసుకోండి: