హొండా బైక్స్ ఉన్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ ను అందించింది. మీకు హోండా స్కూటర్ లేదా.. బండి ఉన్నట్లయితే మీకు ఈ వార్త సంతోషాన్ని కలిగిస్తుంది. గతంలో కూడా ఇలాంటి ఆఫర్లను అందుబాటు లోకి తీసుకువచ్చింది.. వాటికి యువత నుంచి మంది స్పందన వచ్చింది. చాలా మంది ఈ ఆఫర్ ను వినియోగించుకున్నారు. ఇకపోతే ఈ మధ్య కరోనా కారణంగా ఈ కంపెనీ తయారీని నిలిపివేశారు. అంతేకాదు.. కొత్తగా తగ్గింపు ధరలను ప్రకటించారు.  మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటు లో ఉంది. కంపెనీ ఉచిత సర్వీస్, వారంటీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా హెచ్ఎంఎస్ఐ వారంటీ అండ్ ఫ్రీ వెహికల్ సర్వీస్‌ బెనిఫిట్స్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

కంపెనీ తాజా నిర్ణయం తో వాహనదారులకు ఊరట కలుగనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న కంపెనీ డీలర్‌ షిప్ నెట్‌ వర్క్‌కు కంపెనీ నిర్ణయం వర్తిస్తుంది. 2021 జూలై 31 వరకు వారంటీ, వెహికల్ సర్వీస్ పొడిగింపు అందుబాటు లో ఉంటుంది. హోండా టూవీలర్ కస్టమర్లు అందరికి ఈ ఆఫర్ అందుబాటు లో ఉంది. ఏప్రిల్ 1 నుంచి మే 31 మధ్య లో వారంటీ, ఉచిత సర్వీస్, ఎక్స్‌టెండెడ్ వారంటీ అయిపోయే హోండా టూవీలర్ల కు మాత్రమే ఈ పొడిగింపు వర్తిస్తుంది.

హోండా మాత్రమే కాకుండా ఇప్పటికే చాలా కంపెనీలు వారంటీ పొడిగింపు నిర్ణయాన్ని వెల్లడించైనా సంగతి తెలిసిందే.. రోనా వైరస్ సెకండ్ వేవ్ కారణం గా ఇప్పటికే హ్యుందాయ్, టయోటా, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి కంపెనీలు అన్నీ వారంటీ పొడిగింపు ప్రకటించాయి. టూవీలర విభాగం లో అయితే యమహా కంపెనీ వారంటీని పొడిగించింది. జూన 30 వరకు పొడిగించినట్లు తెలుస్తుంది. ఇది నిజంగానే అదిరిపోయే న్యూస్.. ఇక ఆలస్యం ఎందుకు హోండా సేవలను ఉచితంగా ఉపయోగించుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: