సాధారణంగా చాలా మంది ఉద్యోగం చేయలేక బిజినెస్ చేయాలని,  వ్యాపారం వైపు అడుగులు వేస్తూ ఉంటారు. అయితే ఈ వ్యాపారం చేయడానికి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి అవసరమవుతుంది. అందుకే మరి కొంతమంది వెనుక అడుగు వేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం ,  తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ రాబడి పొందవచ్చు. ముఖ్యంగా మీరు పది వేల రూపాయలతో కూడా వ్యాపారాన్ని మొదలు పెట్టి , మంచి లాభాన్ని పొందవచ్చు . ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


1. కాస్ట్యూమ్ జ్యువెలరీ:
ఇటీవలి కాలంలో యువత ఎక్కువగా ఫ్యాషన్, స్టైల్ మీద  మక్కువ చూపుతోంది. ఇక అందులో అమ్మాయిల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరికి ఎప్పుడూ ఫ్యాషన్ గా, స్టైల్ గా ఉండాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అందుకు తగ్గట్టుగా మీరు కూడా ఒక చిన్న దుకాణం ఏర్పాటు చేసి , అందులో ఈ కాస్ట్యూమ్స్ అలాగే జ్యువెలరీ ని హోల్సేల్ ధరలకు తీసుకొచ్చి, మీకు నచ్చిన ధరల్లో అమ్మి లాభం పొందవచ్చు.

2. గ్రీన్ టీ:
కరోనా వచ్చిన తరువాత ప్రజల్లో ఆరోగ్య బాధ్యత ఎక్కువ అయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువగా గ్రీన్ టీ పై మక్కువ చూపుతున్నారు. కాబట్టి ఈ గ్రీన్ టీ వ్యాపారం మొదలు పెట్టినా కూడా మంచి లాభాలు ఉంటాయి.


3. ఆన్లైన్ బేకరీ:
ఫుడ్ ఐటమ్స్ కు ఉన్న డిమాండ్ మరే  ఐటమ్ కు లేదనే చెప్పవచ్చు. అందులోనూ ఆన్లైన్ ద్వారా ఫుడ్  ని ఇంటికి డెలివరీ చేయడం వల్ల మరింత లాభం పొందవచ్చు. ఇప్పటివరకు కేవలం ఫుడ్  మాత్రమే డెలివరీ అవుతున్న సమయంలో, మీరు స్నాక్ఐటమ్స్ ను కూడా హోమ్ డెలివరీ చేసి మంచి లాభార్జన పొందవచ్చు.


4. మొబైల్ యాక్సెసరీస్:
మొబైల్ కనుక  ఏదైనా ప్రాబ్లం వస్తే, వెంటనే మనం సిటీకి వెళ్లి బాగు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇలాంటి మొబైల్ షాప్ లు పెట్టడం వల్ల మంచి ప్రయోజనం పొందవచ్చు.

5. టిఫిన్ సెంటర్:
ప్రతి ఒక్కరు ఉదయాన్నే హడావుడిగా ఆఫీసుకు వెళ్ళేటప్పుడు టిఫిన్ చేయడం కూడా మర్చిపోతారు. టిఫిన్ చేయకపోవడం వల్ల ఆ రోజంతా ఆరోగ్య  సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి అలాంటి వారికి టిఫిన్ సెంటర్ ద్వారా టిఫిన్ అందించడం వల్ల కూడా మీకు మంచి లాభం ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: