మహిళలు నేటి సమాజంలో పురుషులకు ధీటుగా అనేక రంగాలలో రాణిస్తూనే ఉన్నారు. వారు చేరుకోలేని స్థానం అనేది లేకుండా అన్ని రంగాలలో తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ముందంజలో ఉంటున్నారు. ముఖ్యంగా కొందరు మహిళలు సాధించే విజయాలు మిగిలిన మహిళలకు ఎంతో స్ఫూర్తిగాయకంగా ఉంటున్నాయి. వీరిని చూసి మిగిలిన వారుకూడా పట్టుదలతో తాము చేరుకోవాలని ఆశించిన స్థానాలను అందుకుంటున్నారు. భారతదేశంలో ఇటువంటి పరిస్థితులు ఎంతో స్వాగతించదగినవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొందరు ధైర్యంగా ముందడుగు వేస్తేనే తరువాత వచ్చేవారికి సులభంగా ఉంటుందని వారు అన్నారు.

తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన భారత అత్యంత సంపన్న జాబితాలో మొదటి వంద మందిలో మహిళలు ఉండటం విశేషం. ఇందులో ప్రధమంగా ఓపి జిందాల్ గ్రూప్ కు చెందిన జిందాల్ సావిత్రి(71 సంవత్సరాలు) ఉండగా, ఆమె సంపద 13.46 లక్షల కోట్లుగా ఉంది. గతేడాది ఆమె సంపద 9.72 లక్షలుగా ఉంది. మొత్తం జాబితాలో ఈమె ఏడవ స్థానం దక్కించుకోగా, మహిళల జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక రెండో స్థానంలో వినోద్ రాయ్ గుప్తా ఉన్నారు. హావెల్స్ ఇండియా సంస్థకు  చెందిన ఈమె వయసు 76 సంవత్సరాలు. ఈమె సంపద విలువ 5.68 లక్షల కోట్లు ఉండగా, జాబితాలో 24వ స్థానంలో ఉన్నారు.

మూడో స్థానంలో యూ.ఎస్.వి ప్రైవేట్ లిమిటెడ్(బయో టెక్, ఫార్మా) కు చెందిన నీలా తివారీ(43 సంవత్సరాలు) ఉన్నారు. ఈమె సంపద 3.28 లక్షల కోట్లుగా ఉంది. జాబితాలో 43 స్థానంలో ఉన్నారు. నాలుగో స్థానంలో బైజూస్ కో ఫౌండర్ గోకుల్ నాధ్ (35 సంవత్సరాలు) ఉన్నారు. వీరి సంపద 7477కోట్లుగా ఉంది. జాబితాలో 47వ స్థానంలో ఉన్నారు.  ఐదవ స్థానంలో బయో కాన్ కు చెందిన కిరణ్ మంజునాధ్ షా (68 సంవత్సరాలు) ఉన్నారు. వారి సంపద 2.91 లక్షల కోట్లుగా ఉంది. ఆరవ స్థానంలో ట్రాక్టర్ అండ్ ఫామ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్(టి.ఏ.ఎఫ్.ఈ.) చెందిన మల్లికా శ్రీనివాస్ ఉన్నారు. వారి సంపద 2.16లక్షల కోట్లుగా ఉంది. జాబితాలో 73వ స్థానంలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: