భారతీయ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీకి అరుదైన ఘనత దక్కింది. ఆయన ఆసియాలోనే అతి కొద్ది మంది సాధించగలిగే అత్యంత ధనవంతుల జాబితాలో స్థానం దక్కించుకున్నారు. తాజాగా ఆయన బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ అనుసరించి ఆసియాలోనే అత్యంత ధనవంతులైన ముఖేష్ అంబానీ, జెఫ్ బెజోస్, ఎలెన్ మస్క్ తో కలిసి ప్రత్యేకమైన ధనవంతుల క్లబ్(ఎలైట్)లో స్థానం సంపాదించాడు. ఈ ఇండెక్స్ ప్రకారం ఆయన తాజా సంపాదన 3.22 బిలియన్ డాలర్ల సంపదతో కలిపి 101 బిలియన్ డాలర్లకు చేరింది. అంటే వంద బిలియన్ డాలర్ల ఎలైట్ క్లబ్ లో ఆయన చోటు దక్కించుకున్నారు. ఆసియాలో తొలి వ్యక్తిగా ముఖేష్ ఈ క్లబ్ లో చోటు సాధించారు. ఇక తాజాగా వెలువడిన ప్రపంచ ధనవంతుల జాబితాలో 11వ స్థానంలో ముఖేష్ ఉన్నారు.

అదే నివేదికలో అదానీ సంస్థ అధినేత గౌతమ్ అదానీ 73.3 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ ధనవంతులలో 14వ స్థానంలో ఉన్నారు. ముఖేష్ అంబానీ తండ్రి వద్ద నుండి వచ్చిన వారసత్వ సంపదను ఆయన లాగానే బాధ్యతాయుతంగా సంస్థను నిర్వహిస్తూ ఈ స్థాయికి తెచ్చారు. ముఖేష్ చమురు శుద్ధి, పెట్రో కెమికల్స్ వ్యాపారాలను వారసత్వంగా పొందినా, అనంతరం అనేక అనుబంధ సంస్థలు స్థాపించి వాటిలో రాణించారు. అలాగే అనేక సంస్థలతో, సామజిక మాద్యమాలతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఈ ఏడాది ఆయన సంస్థ నిర్వహించిన వార్షిక సమావేశంలో గ్రీన్ ఎనర్జీ కి ప్రత్యేక ప్రోత్సహం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ నేపథ్యంలోనే గ్రీన్ ఎనర్జీ లో వచ్చే మూడు ఏళ్లలో దాదాపు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సంస్థ నిర్ణయించుకుంది. ఒక పక్క ప్రణాళిక బద్దమైన పెట్టుబడులు చూసుకుంటూ, మరోవైపు భారత్ తన ఇంధన దిగుమతులు తగ్గించి, తద్వారా గ్రీన్ ఎనర్జీ లాంటివి వాడకం దేశంలో పెంచేందుకు ప్రణాళికలు వేస్తున్నాడు ముఖేష్ అంబానీ, అందుకు ఆయన కృషి చేస్తున్నారు. దీనితో భారత్ లోనే ఇంధనం దొరుకుతుంది. ఏ దేశంపై ఆధారపడకుండా ఉండొచ్చు అనేది ఆయన ఆలోచన.

మరింత సమాచారం తెలుసుకోండి: