ఉమ్మడి వరంగల్ జిల్లా లోని 5వ షెడ్యూల్లో ఏరియాలో 1975లో నిర్మితమైన ఏపీ రేయాన్స్ ఫ్యాక్టరీ ఇక చరిత్రకే పరిమితం కానుంది. 1980లో ఉత్పత్తిని ప్రారంభించిన ఈ పరిశ్రమ 2014లో మూతపడింది. పరిశ్రమలు పునరుద్ధరించడానికి ప్రభుత్వం రాయితీలు ప్రకటించిన నడిపేందుకు బిల్డ్ యాజమాన్యం ముందుకు రాకపోవడంతో కార్మికులు రోడ్డున పడ్డారు. ఉమ్మడి వరంగల్ ఏకైక పెద్ద పరిశ్రమ పునరుద్ధరణపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. పరిశ్రమలో ఏటా ఉత్పత్తి అయ్యే 90 వేల టన్నుల కాగితపు గుజ్జును గ్రాసీమ్ కంపెనీ కొనుగోలు చేసేది.

 కానీ గ్రాసిమ్ కంపెనీ సొంతంగా కంపెనీ ఏర్పాటు చేసుకోకపోవడంతో 2014 నుంచి బిల్డ్ కాగితపు గుజ్జు కొనుగోళ్లను ఇక్కడి నుంచి నిలిపేసింది. దీంతో అదే ఏడాది ఏప్రిల్ 6న బిల్డ్ మూతపడింది. ఈ క్రమంలో 2015 మార్చి 9 నుంచి 2016 మార్చి 6 వరకు కార్మికులు ఏడాదిపాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పరిశ్రమలు పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలు ప్రకటించిన యాజమాన్యం నేటికీ ముందుకు రాలేదు. ఐడీబీఐ నుంచి తీసుకున్న 5 వేల కోట్ల రుణాన్ని చెల్లించకపోవడంతో యాజమాన్యానికి బ్యాంకు నోటీసు జారీ చేసింది. పరిశ్రమను తెరవాలని గత సెప్టెంబర్లో పలువురు కార్మికులు, కమలాపూర్ నుంచి ప్రగతి భవన్ కు పాదయాత్ర ప్రారంభించగా, ములుగులో  పోలీసులు అడ్డుకున్నారు. వరంగల్ లో ఆజంజాహి మిల్లు మూతపడిన దిశలోనే బిల్డ్ మూతపడడంతో జిల్లాలో పెద్ద పరిశ్రమలు కరువయ్యాయి. రాష్ట్రప్రభుత్వం గౌతమ్ దాపర్ నేతృత్వంలోని అవంతి బిల్డ్ గ్రూపు తో చర్చించి.. జరిగిన ఒప్పందం మేరకు పలు సబ్సిడీలను ప్రకటించి  జీఓఎంఎస్ నెంబర్ 91 జారీచేసింది. ఈ జీవో ప్రకారం ఏటా 30 కోట్ల చొప్పున ఏడేళ్లపాటు 210 కోట్లను రాయితీల రూపంగా ఇవ్వడానికి నిర్ణయించింది. అలాగే ఏటా 9 కోట్ల విద్యుత్ సబ్సిడీ తో పాటు నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల నీలగిరి కలపను ఐదేళ్లపాటు అందించడానికి, ఇతర పన్నుల్లో సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఏపీలో లభించే నీలగిరి కలపను సబ్సిడీపై పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నాటి ఏపీ సీఎం చంద్రబాబు తో చర్చలు జరిపిన విషయం విధితమే.

అయినా పరిశ్రమలు నడపడానికి యాజమాన్యం ముందుకు రాలేదు దీంతో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ పరిశ్రమలో పదివేల మంది తాత్కాలిక, రోజువారి వేతన కార్మికులు పని చేసేవారు. అనేక మందికి ఉపాధి చూపిన పరిశ్రమ 2014 ఏప్రిల్ 6 న మూతపడడంతో ప్రత్యక్షంగా,పరోక్షంగా వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి.ఇప్పటివరకూ 36 మంది ఉద్యోగులు మృతి చెందారు.ఎప్పటికైనా పరిశ్రమ తెరుచుకుంటుందని కళ్ళు కాయలు కాసేలా కార్మికులు ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: