విద్యుత్ సంక్షోభం : టాటాల చేయాత


దేశం ప్రస్తుతం ఎదుర్కోంటున్న, భవిష్యత్ లో ఎదురు కానున్న విద్యుత్ కష్టాల నుంచి గట్టెక్కేందుకు టాటాలు తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. విద్యుత్  ఇబ్బందులు అధికంగా ఉన్న రాష్ట్రాలకు టాటాలకు చెందిన టాటా పవర్ కంపెనీ విద్యుత్ ను సరఫరా చేసేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని పా రిశ్రామిక వర్గాలు ధృవీకరించాయి. దేశంలో బొగ్గు నిల్వలు తగ్గడం, తద్వారా విద్యత్ సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలు మందస్తు  చర్యలు చేపట్టయి. చాలా రాష్ట్రాలు విద్యుత్ కోత  మూలంగా భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ రాష్ట్రాల జాబితాలో గుజరాత్ , పంజాబ్ రాష్ట్రాలు ముంద వరసలో ఉన్నాయి.
గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలకు విద్యత్ ను అందించేందుకు టాటా పవర్ సంస్థ  ముందుకు వచ్చింది. గుజారాత్ ప్రభుత్వానికి 1800 మెగావాట్ల విద్యుత్ ను సరఫరా చేసేందుకు తన అంగీకారాన్ని తెలిపింది. తమను ఆపత్కాలంలో అదుకునేందుకు ముందుకు వచ్చిన టాటా పవర్ సంస్థకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతులు తెలిపింది.  అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం ఒక  యూనిట్ విద్యత్ కు గుజరాత్ ప్రభుత్వం రూ.4.5ం చెల్లించ నుంది. నాలుగు వారాల పాటు నిరాటంకంగా టాటా పవర్ కంపెనీ గుజరాత్ రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేయనుంది.
గుజరాత్ రాష్ట్రం నడిచిన బాట లోనే మరో రాష్ట్రం కూడా టాటాల సాయం పొందనుంది. అది పంజాబ్ రాష్ట్రం.  పంజాబ్ లో నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన చెరణ్ సింగ్ చెన్నీ స్వయంగా టాటా పవర్ కంపెనీ అధికారులతో మాట్లాడారు. గుజరాత్ రాష్ట్రానికి అంద జేస్తున్న విధంగానే తమకూ విద్యత్ సరఫరా చేయాలని అభ్యర్థించారు. దీనికి టాటా లు ఓకే చెప్పారు. దీంతో ఆ రాష్ట్రం కూడా విద్యుత్ సమస్య నుంచి బైట పడే అవకాశం ఉంది. రోజుకు ఐదు వందల మెగావాట్ల విద్యత్ ను పంజాబ్ రాష్ట్రం అందుకో నుంది. ఇందుకు గాను ఆ రాష్ట్రం ఒక యూనిట్ విద్యుత్ కు రూ.5.50 చెల్లించ నుంది.  గుజరాత్ , పంజాబ్ రాష్ట్రాలు రెండింటికీ కూడా టాటా సంస్థ ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యత్ సరఫరా చేస్తుంది.  కేవలం విద్యత్ ను ఉత్తప్తి చేసేందుకు అయ్యె వ్యయాన్ని మాత్రం రాష్ట్రాల నుంచి తీసుకుంటోంది.
విద్యుత్  కోరతను ఎక్కువగా ఎదుర్కోనున్న రాష్ట్రాలు రాజస్థాన్, మహారాష్ట్ర,  హర్యానాలు కూడా టాటా సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నాయి. అదే సమయంలో వారు అదాని పవర్ కంపెనీతోను చర్చలు జరుపుతున్నారు. ఆదాని పవర్ కంపెనీకి 3,300 మెగావట్ల విద్యత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఉంది. దీని నుంచి తమకు సరఫరా చేయాని  ఈ రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయి. ఇవి ఒక యూనిట్ విద్యుత్ కు 13,16 పైసల వంతున ఆదాని పవర్ కంపెనీకి ఇప్పటికే చెల్లిస్తున్నాయి.












మరింత సమాచారం తెలుసుకోండి: