ఎయిర్ ఇండియా :  రతన్ టాటా తాజాగా ఏమంటున్నారో తెలుసా ?

  ఎయిర్ ఇండియా సంస్థను హస్తగతం  చేసుకున్న తరువాత రతన్ టాటా ఏమని వ్యాఖ్యానించారో  మీకు  గుర్తుందా ? వెల్కమ్ బ్యాక్ ఎయిర్ ఇండియా అని ప్రకటించారు. తమకు ఇవి భావోద్వేగ క్షణాలని పేర్కోన్నారు. డిసెంబర్ కల్లా లావాదేవీలను పూర్తి చేసి పునర్ వైభవం తీసుకువస్తామని సగర్వంగాప్రకటించారు. 153 ఏళ్ల టాటా గ్రూప్ కు ఇవి చాలా సంతోషకరమైన క్షణాలని తన ఆనందాన్ని ప్రకటించారు. ఇంతేనా ? ఇంకేమయినా చెప్పారా ? ప్రస్తుతం ఆయన ఏమంటున్నారు ?
రతన్ టాటా తాజాగా చెసిన ప్రకటన  పారిశ్రామిక, వ్యాపార వర్గాలలో ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని  మరోసారి  తెలియపరచింది.  ఎయిర్ ఇండియా తిరిగి టాటాల గూటికి రావడం వెనుక తన కృషి ఏ మాత్రం లేదని ఆయన ఒప్పుకున్నారు. మీరు నమ్నినా, నమ్మక పోయీనా ఇది నిజం అని కండబద్దలు కొట్టినట్లు ప్రకటించారు. ఎయిర్ ఇండియాను టాటా సన్స్ చేతికి వచ్చాక చాలా మంది పాత్రికేయులు రతన్ టాటాతో సంభాషించడానికి ఉవ్విళ్లురారు. ఏదో గొద్ది మంది పాత్రికేయలకు మినహా ఎక్కువ మందికి రతన్ టాటా అపాయింట్ మెంట్ దొరక లేదు. దొరికిన వాళ్లను ఏమీ రాయవద్దని, తనకు ప్రచారం ఇష్టం లేదన్న విషయం మీకు తెలుసు కదా అంటూ రతన్ టాటా సున్నితంగా తిరస్కరించారు.
ఎయిర్ ఇండియాను తిరిగి స్వంతం చేసుకోవాలన్న ఆలోచన టాటాగ్రూప్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఎన్. చంద్ర శేఖర్ న్ ది అని రతన్ టాటా ప్రకటించారు.  ఆయన, ఆయన సిబ్బంది కృషి మూలంగానే ఎయిర్ ఇండియా  టాటాల చేతికి వచ్చిందని తెలిపారు. ప్రతి దశలోనూ చంద్రశేఖరన్ కృషి వెలకట్టలేనిదని రతన్ టాటా వ్యాఖ్యానించారు. విమానయా రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్న చంద్రశేఖరన్ మదిలోని ఆలోచనలకు అనుగుణంగా ఆయన సిబ్బంది పని చేశారని  రతన్ టాటా తెలిపారు. పైలెట్ లైసెన్సులు, ఎయిర్ క్రాఫ్ట్ లు,  హెలికాఫ్టర్  రంగం తదితర అంశాలపై చంద్రశేఖరన్ చాలా కాలంగా లోతైన పరిశోధన చేస్తు వచ్చారని రతన్ టాటా చెప్పారు. వ్యాపార దక్షత కలిగిన వ్యక్తి నేతృత్వంలో ఎయిర్ ఇండియ మరింత ఖ్యాతిన పొందుతుందని  రతన్ టాటా తెలిపారు.
ఎయిర్ ఇండియా, దాని అనుబంధ కంపెనీలకు దాదాపు 61,662 కోట్ల రూపాయలు అప్పులున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఇందులో కేవలం 15,330 కోట్లకు మాత్రం టాటాలు బాధ్యత తీసుకుంటారు. మిగిలిన బకాయీలన్నీ కూడా ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ ఏఐఏహెచ్ఎల్ కు బదిలీ అవుతాయి. ప్రస్తుతం పనిచేస్తున్న 12 వేల మందికి పైగా ఉద్యోగులందరినీ సంవత్సరం పాటు టాటాలు భరించాల్సి ఉంటుంది. రెండో సంవత్సరంలో వారికి వీఆర్ ఎస్ పథకాన్ని అమలు చేయవచ్చు. టాటా సన్స్ అధికారులు చెబుతున్న గణాంకాల ప్రకారం వచ్చే ఐదేళ్లలో దాదాపు ఐదు వేల మంది సిబ్బంది ఉద్యోగ విరమణ చేస్తారు. ఈ లోపలే ఎయిర్ ఇండియాకు పునర్ వైభవం తీసుకురావాల్సి ఉంటుంది.

----


మరింత సమాచారం తెలుసుకోండి: