దేశ వ్యాప్తంగా సామాన్యుడిపై పెట్రో, డీజీల్ బాదుడు కొన‌సాగుతూనే ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఆకాశ‌న్నంటుతున్నాయి. పండుగ పూట కూడా పెట్రో ధ‌ర‌ల మంట మండుతూనే ఉంది. వరుసగా మూడో రోజూ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు. గడిచిన మూడు వారాల్లో డీజిల్‌ ధరలు 18 సార్లు..పెట్రోల్‌ ధరలు 15 సార్లు పెంచిన కంపెనీలు. తాజాగా ఈ రోజు లీటర్‌ పెట్రోల్ పై 36 పైసలు‌, డీజిల్‌పై 38 పైసలు చొప్పున ధరలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠంగా ఏపీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 112.14, లీటర్‌ డీజిల్‌ ధర రూ. 104.53 గా ఉంది. హైదరాబాద్‌లో నేడు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 109.73కాగా, లీటర్‌ డీజిల్‌ ధర రూ. 102.80 కు చేరింది. ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు పెట్రోల్‌పై రూ.15.21, డీజిల్‌పై రూ. 14.22 పెరిగింది.


   
   తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఇలా ఉన్నాయి... క‌రీంన‌గ‌ర్‌లో లీట‌ర్ డీజీల్ ధ‌ర రూ.109.70 - లీట‌ర్ పెట్రోల్  ధ‌ర రూ. 102.72 ప‌లుకుతోంది. ఖ‌మ్మంలో పెట్రోల్ ధ‌ర రూ.109.80- డీజిల్ ధ‌ర రూ. 102.53 గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 109.37 ప‌లుకుతుండ‌గా లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ. 102.42  ప‌లుకుతోంది. వ‌రంగ‌ల్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 109.09 ఉండ‌గా, లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.102.15 గా ఉంది.



   విశాఖ‌ప‌ట్నంలో లీటర్ పెట్రోల్ ధ‌ర రూ.110.99 ప‌లుక‌గా, లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ. 103.43 ఉంది. విజ‌య‌వాడ‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 112.04 కు ఉండ‌గా, లీట‌ర్ డీజిల్‌ ధ‌ర రూ. 104.44 లు ఉంది. విజ‌య‌న‌గ‌రంలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.110.88, లీట‌ర్ డీజిల్ రూ. 1103.33 కు ల‌భిస్తోంది.గుంటూర్ జిల్లాలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 112.04 ఉండ‌గా, డీజిల్ రూ. 104.44  ఉంది.










మరింత సమాచారం తెలుసుకోండి: