పబ్‌జీ  గేమ్  కమింగ్ బ్యాక్

భారత్ - చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత ప్రభుత్వం నిషేధించిన యాప్ లలో పబ్‌జీ కూడా ఒకటి. అది ప్రస్తుతం తిరిగి భారత్ మార్కెట్ లో ప్రవేశించ నుంది. అది కూడా మరో నెలరోజుల లోపలే దేశీయ మార్కెట్ ను ప్రభావితం చేయనుంది. భద్రతా కారణాల రీత్యా కేంద్ర ప్రభుత్వం పలు యాప్ లను గతంలో నిషేధించింది. వీటిలో పబ్‌జీ కూడా ఒకటి. భారత్‌లో పబ్‌జీ ని చైనాకు చెందిన టెన్సెంట్‌ గేమ్స్‌ సంస్థ పంపిణీ చేసేది. భారత దేశం చైనా పై ఆంక్షలు విధించిన తర్వాత ఆ కంపెనీకి భారత్‌లో పంపిణీ హక్కులను ఉపసంహరించినట్లు పబ్‌జీ కార్పొరేషన్‌ అప్పట్లో ప్రకటించింది.

అ తరువాత కొంత కాలానికి పబ్ జీ త్వరలో భారతీయులకు అందుబాటులోకి రానుందనే వార్త సామాజిక మాధ్యమాలలో హల్ చల్ చేశాయి. దేశంలో శాంతి భద్రతల నేపథ్యంలో నిషేధం ఎదుర్కోంటున్న పబ్ జీకి ఆటకు భారత్ లో ఇక అనుమతి ఉండదని భారతీయ జనతాపార్టీ నేతలు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఆన్ లైన్ ఆటకు అనుమతివ్వదని పేర్కోన్నారు.
పబ్ జీ గేమ్ ను భారత ప్రభుత్వం నిషేధించక ముందు భారత దేశంలో ఈ ఆటపై పలు వివాదాలు జరిగాయి. పబ్ జీ వల్ల తమ పిల్లలు  తప్పుదారి పడుతున్నారని పలువురు తల్లితండ్రులు ఆక్రోశించారు. ముంబైకి చెందిన పదహారేళ్ల  కుర్రాడు తన తల్లి అకౌంట్ నుంచి  లావాదేవీలు జరిపి దాదాపు పది లక్షల రూపాయల పైన పోగొట్టుకున్నాడు.  ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఇదే రకమైన పలు ఉదంతాలు వెలుగు చూసాయి. మధ్య ప్రదేశ్,  చత్తీస్ ఘడ్ ప్రాంతాలలో పలువురు చిన్నారులు తమ తల్లింతండ్రుల కు తెలియకుండా వారి ఖాతాల నుంచి లక్షలాది రూపాయలను పబ్ జీ కోసం వెచ్చించారు. దీంతో ఈ ఆటను నిషేధించాలని అన్ని రాజకీయ పక్షాలు ప్రభుత్వాన్ని కోరాయి కూడా.  చైనా పై ఆంక్షల నేపథ్యంలో ఈ గేమ్ ను భారత్ లో నిషేధించారు.

తాజాగా దక్షిణ కొరియా గేమింగ్‌ సంస్థ క్రాఫ్టన్‌ తాజాగా పబ్ జీ ని భారత్ లో ప్రవేశ పెట్టనుంది.  ఈ సంస్థ బ్యాటిల్‌గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా గేమ్‌ (బిజి ఎం.ఐ) ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టనుంది.  భారతీయుల కేసం ప్రత్యేకంగా ఈ గేమ ను రూపొందించామని ఆ సంస్థ తెలిపింది. నవంబర్ 11 న ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆన్ లైన్ గేమ్ అందుబాటులోకి రానుందని క్రాఫ్టన్  ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: