ఒక ఉద్యోగం చేయడంలో ఉన్న కష్టనష్టాలు అందరికి తెలిసినవే. అయితే కొందరు కష్టసాధ్యం అయిన పనులను కూడా అందరు ఆశ్చర్యపోయేలా చాలా సులభంగా చేస్తుంటారు. వాళ్ళు ఆ పని అంత సులభంగా ఎలా చేశారు అనేదాని గురించి ప్రజలు అందరు ఆలోచించక మానరు. అది ఇక సేల్స్ మెన్ ఉద్యోగం అంటే అంత ఆషామాషీ ఏమీ కాదు. అది అందరికి తెలిసిందే. అయినా కొందరు ఇట్టే తమకు ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేసేసి విశ్రాంతి కూడా తీసుకుంటూ ఉంటారు. మిగిలిన వారు మాత్రం లక్ష్యాలు ఛేదించలేక అక్కడే ఆగిపోతూ ఉంటారు. అయితే ఆయా వ్యక్తులు వాటిని ఎలా అంత సులభంగా చేయగలిగారు అని అడిగితే మనస్తత్వ శాస్త్రవేత్తలు కూడా ఒకే మాట చెపుతారు, కేవలం వాళ్ళు చేసే పనిని వాళ్ళు ప్రేమించి చేశారు, అందుకే కష్టంతో కాకుండా ఇష్టంగా పని చేసినప్పుడు అందులో ఎవరూ ఊహించని ఫలితాలు అనుకున్న సమయానికంటే ఎంతో ముందే సాధించవచ్చు.

ఇదంతా పండుగ సీజన్, ఈ సమయంలో మా వస్తువులు కొనండి, ఇంత డిస్కౌంట్ ఇస్తాం అంటూ బోలెడు శబ్దాలు చేస్తూ, వివిధ మాధ్యమాలలో కూడా అనేక ప్రకటనలు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఆయా సంస్థలు తమ వస్తువులను విక్రయించుకోవడానికి వాడే ఒకరకమైన వ్యూహమే. అంటే ఆయా ప్రకటనలు ఎక్కువ సేపు చూసి చూసి అవి కొనాలని మనిషి మనసులో ముద్రపడి ఏదో ఒకనాటికి వాటిని కొనే స్థితికి వెళ్తాడు. అది సంస్థలకు కలిసివస్తుంది. అందుకే ఆయా సీజన్ లలో సంస్థలు భారీ డిస్కౌంట్స్ అంటూ బోలెడు ప్రకటనలు ఇస్తుంటాయి. ఇప్పుడు ఇవి కూడా కాస్త పాతబడ్డాయనే చెప్పాలి.

కారణం, చాలా పెరిగిపోయిన లేదా విస్తరించిన సామజిక మాద్యమాలతో ప్రజలు ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీనిలో ఒక్కొక్కరికి బోలెడు మంది అనుసరించే వారు ఉంటున్నారు. ఇలా కొంత కాలం అయ్యాక, అంటే కాస్త నమ్మకం కలిగించాక వస్తు విక్రయాలకు పూనుకుంటున్నారు. అప్పుడు ఎక్కువ సేల్ చేయగలుగుతున్నారు. అంటే సాంకేతికత సేల్స్ మెన్ ఉద్యోగాలను సులభతరం చేసింది. ఈ కామర్స్ తరహాలో సామజిక మాధ్యమాలలో కూడా బోలెడు వస్తువులు అమ్ముడుపోతున్నాయి. తాజాగా ఇదే తరహాలో ఒక సామజిక మాధ్యమంలో కోట్లలో అనుసరించేవారు ఉన్న ఒక అతను ఇదే తరహాలో ముందు స్నేహం అంటూ అందరికి తన వద్ద వస్తువులను చూపిస్తూ, అనంతరం ఒక్కరోజులో 14వేల కోట్ల వస్తువులను అమ్మేశాడు. అతడే లీ, అలీబాబా లీ జియా.

మరింత సమాచారం తెలుసుకోండి: