భారతదేసంలో ఇంధన ధరలు వంద దాటితే చూడాలి అనుకున్నవారి కల నెరవేరింది. అంతటితో ఆగలేదు సుమీ, వంద ఎప్పుడో దాటేసి 112 వరకు వచ్చేసింది. అంటే ఇక సామాన్యుల రేషన్ ధరలు ఎంత పెరిగి ఉంటాయో చూడొచ్చు. ఉదాహరణకు కరోనా ముందు సన్ఫ్లవర్ నూనె ధర 98 ఉంటె ఇప్పుడు 180 దాటేస్తుంది. అంటే రవాణా ఖర్చు పెరిగితే, ఇలాంటి వినియోదాదారులు వాడే సరుకు ధర కూడా పెరిగిపోతుంది. ఇంకా పెరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి తప్ప, తగ్గేదేలే అంటుంది ప్రభుత్వం కూడా. పరిస్థితులు అలా వచ్చాక ఎవరు మాత్రం ఏమి చేయగలం. వస్తున్న చోట రాబట్టుకోవాలి కానీ లేని చోట వెతుక్కోలేము కదా. అందుకే ఎక్కడ వస్తుందో అక్కడే బాధేస్తుంది ప్రభుత్వం కూడా.

ఇంత పెరిగినా గగ్గోలు పెట్టి అదే వాడుతున్నారు తప్ప కొందరైనా సొంత బళ్ళు పక్కన పెట్టి ప్రభుత్వ  వాహనాలు వాడుతున్నారా అంటే సందేహమే. ఇక్కడే అర్ధం అయిపోతుంది కదా ప్రభుత్వానికి, ఎక్కడ వస్తుందో అని. అది మీరు అర్ధం చేసుకోకుండా పెరిగింది అని యాగీ చేస్తే లాభం ఏముంటుంది. అసలే కరోనా దెబ్బతో ఎంతో ఆదాయం పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇక చైనా, పాక్ లాంటి దేశాలు, మరోపక్క పాక్ ప్రేరేపిత తీవ్రవాదం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయుధాలు గట్రా కొనాల్సి వస్తుంది. అంటే ఇప్పుడే కరోనా వలన నష్టాలు చూశాం, కానీ దాయాదుల వలన మరికాస్త నష్టాలు చూడబోతున్నాం. ఒకవేళ యుద్ధాలే జరిగితే అదో నష్టం. అంటే పరిస్థితులు ఇంకా మొండిగా అవుతున్నాయి తప్ప మారవు.  అందుకే ఎవరు మారాలో అర్ధం అయిందనుకుంటాను.

ఇక పెట్రోల్ ధరల విషయానికి వస్తే, భారత్ లో తెలిసిందే. హాంగ్ కాంగ్ లో 192 రూపాయలు, నెదర్లాండ్ లో 163 రూపాయలు, ఆఫ్రికాలో 160 రూపాయలు ఉండగా; నార్వే, ఇజ్రాయెల్, డెన్మార్క్, మొనాకో, గ్రీస్, ఫిన్లాండ్, ఐస్ లాండ్ వంటి దేశాలలో కూడా భారీగానే ధరలు ఉన్నాయి. అతి తక్కువగా ఉన్న దేశాల విషయానికి వస్తే, వెనిజులా లో 1.50 రూ. గా ఉంది, కారణం ఇక్కడ అంతా కరెంటు వాహనాలు. అందుకే పెట్రోల్ వినియోగం చాలా తక్కువ. ఇరాన్ లో ఐదు రూపాయలు, అంగోలా, అల్జీరియా, కువైట్, నైజీరియా, తుర్కమేనిస్తాన్, కజకిస్తాన్, ఇథియోపియాలలో కూడా నాలుగు నుండి ఐదు రూపాయలు దాటదు లీటర్ పెట్రోల్.

మరింత సమాచారం తెలుసుకోండి: