ఇంధనం అమ్ముకోవడం మరియు తమ తమ దేశాలను పర్యాటక రంగాలుగా అభివృద్ధి చేసుకోవడం ద్వారా అరబ్ దేశాలు ఎంతో అగ్రగామి దేశాలుగా మారిపోయాయి. ఒకప్పుడు ఎడారులు తప్ప ఏమి లేని స్థితి నుండి నేడు ప్రపంచం దానిని చూసి ఆకర్షితులు అయ్యే స్థాయికి ఆయా రూపురేఖలు మార్చేసుకున్నాయి ఆయా దేశాలు. ఇదంతా బాగానే ఉంది కానీ, ఒకవేళ ఇంధనం అయిపోతే అనేది కావచ్చు, తమ వద్ద ఎవరు కూడా ఇంధనం కొనకపోతే అనేవి సమస్యలు కానున్నాయి. ఒకటి వాళ్ళు ప్రతిసారి ఇంధనం అవసరం అనుకున్నప్పుడు కావాలని ఇంధన లోటు సృష్టించి, ధరలు పెంచుతూ కావాల్సినంత రాబట్టుకుంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే వాళ్ళ ఆలోచన మంచిదే కానీ, దానికి పక్కవాళ్ళను ఇబ్బంది పెట్టకూడదు కదా.

ఇప్పుడు ఇంధనం ఉంది కాబట్టి నడుస్తుంది, ఒకవేళ ప్రపంచ దేశాలు వాళ్ళ నుండి ఇంధనం కొనడం మానేసి, విద్యుత్ వాహనాలను ఆశ్రయిస్తే పరిస్థితి ఏమిటి అనేది ఆలోచించుకోవాలి. ఒకవేళ అలాగే జరిగితే, కేవలం పర్యాటక రంగం ద్వారా అరబ్ దేశాలు బ్రతికేయడం అంత సులభం కాదు. ఒక స్థాయిలో ఉన్నవి అమ్ముకొని బ్రతికేయాల్సిన స్థితి కూడా వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇవన్నీ మనసులో పెట్టుకొని, కావాలని ధరలు మండించే అతి తెలివి తేటలు మానుకుంటే మంచిది అంటున్నారు విశ్లేషకులు.  

దీనిపై అరబ్ దేశాలు కూడా ఒక మాట అంటున్నాయి, లాక్ డౌన్ లో ఇంధన కొనుగోళ్లు అసలు జరగలేదు, ఆ నష్టాలు ఇప్పుడు పూడ్చుకోవాలి కదా అని. అయినా లాక్ డౌన్ లో కొనుక్కొని ఏమి చేసుకోవాలి, అప్పటిలో నిల్వ ఉన్నది ఏమి చేసుకోవాలో అర్ధం కాక చాలా మంది అల్లాడిపోయారు. కొన్ని పరిస్థితులను చూపించి, వ్యాపారం అందులోకి చొప్పించి మాట్లాడటం సబబు కాదు. ఆనాడు పరిస్థితులు అలాంటివి, నేటికీ పూర్తిగా రవాణా వ్యవస్థ కావచ్చు, ఇతర వ్యవస్థలు కావచ్చు పూర్తిగా అందుబాటులోకి రాలేదు. కారణం కరోనా భయం ఇంకా వేటాడుతూనే ఉంది. ఇవన్నీ ఆలోచించుకుని ప్రవర్తిస్తే, అందరు కలిసి నడవటానికి అవకాశం ఉంటుంది, ఎవరికి వారే అనుకుంటే ఒక నాడు సాయం చేయడానికి ఎవరు మిగలరు. అంతర్జాతీయ సమాజం అనేది ఒకటి ఉంది, ఇందులో కూడా ఒకరికొకరు అండగా ఉండాలి అనేది స్పష్టమైన నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి: