పాత రోజుల్లో ఏ వ‌స్తువు కావాల‌న్నా మ‌నం వెళ్లి ఎంచుకుని తీసుకొచ్చునే వాళ్లం. కానీ, ఇప్పుడు అంతా ఈ-బిజినెస్ యుగం న‌డుస్తోంది. ఏది కావాల‌నుకున్నా ఇంటి ద‌గ్గ‌ర కూర్చొనే.. ఎంపిక చేసుకుని కొనుక్కోవ‌చ్చు. అర‌చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లోనే షాపింగ్ అంత జ‌రిగిపోతోంది. ఏ వ‌స్తువు కొన్నా ఇంటి వ‌ద్ద‌కే వ‌చ్చి డెలివ‌రి చేసి పోతారు. ఇప్పుడు మార్కెట్‌లో ఇలాంటి సౌక‌ర్యాలు చాల ఉన్నాయి. ఇలా ఆన్‌లైన్‌లో తినే తిండి ద‌గ్గ‌ర నుంచి వాడే ప్ర‌తి వ‌స్తువుల‌న్నీ ఆర్డ‌ర్ చేయ‌డానికి ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్ ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంది. హాయ్ గా ఇంట్లో కూర్చునే మ‌న‌కు కావాల్సిన‌వి కొనుక్కొవ‌డం కంటే ఇంకేం కావాల‌నే భావ‌న‌లో చాలా మంది ఉన్నారు. 


ఇక ఇటీవ‌ల ప‌లు ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు వంట సామాను నుంచి కూర‌గాయ‌లు హోం డెలివ‌రి చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇలాంటి హోం డెలివ‌రీ సంస్థ‌లు పోటాపోటీగా మార్కెట్‌లోకి వ‌స్తుండ‌డంతో జ‌నాలు ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండానే అన్ని వ‌స్తువ‌లు ఇంటి తెచ్చుకుంటున్నారు. ఇక ఇప్ప‌టికే  బ్యాంక్ లావాదేవీలు అన్నీ ఆన్‌లోనే జ‌రుగుతున్నాయి. ఇక ఇవ‌న్నీ మ‌న‌కు తెలిసిన విష‌యాలే.. వీటికి అడ్వాన్స్‌గా మ‌ద్యం కూడా హోం డెలివ‌రీ కూడా ఇప్పుడిప్పుడే మొద‌ల‌యింది. ప‌లు రాష్ట్రాల్లో ఇప్ప‌టికే అధికారికంగా మ‌ద్యం హోం డెలివ‌రీ చేస్తున్నాయి. అయితే, పెట్రోల్‌, డీజిల్ కోసం ప్ర‌జ‌లంద‌రూ త‌ప్ప‌నిసరిగా పెట్రోల్ బంక్‌కు వెళ్లాల్సి ఉంటుంది. సామాన్యుడి దగ్గ‌రి నుంచి ధ‌న‌వంతుడి వ‌రకు అంద‌రూ పెట్రోల్ బంక్‌లో లైన్ క‌ట్టాల్సిందే.


   ఈ క్ర‌మంలోనే పెట్రోల్‌, డీజిల్ కూడా ఆన్‌లైన్ డెలివ‌రీ వ‌స్తే బాగుంటుంద‌న్న అభిప్రాయం వెలువ‌డుతోంది. ఇక ఇప్పుడు ఇది కూడా నిజం కాబోతోంది.. భార‌త్ పెట్రోల్ సంస్థ వినూత్న కార్యక్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. బీపీసీఎల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే పెట్రోల్‌, డీజీల్ హోం డెలివ‌రీ చేస్తామ‌ని ఆ సంస్థ తెలిపింది. ఎవ‌రు కూడా పెట్రోల్ బంక్‌కు రావాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని చెప్పింది. ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌స్తుతం విజ‌య‌వాడ‌లో ప్రారంభిస్తున్న‌ట్టు బీపీసీఎల్ సౌత్ డీజీఎం రాఘ‌వేంద‌ర్ రావు చెప్పారు. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు అనుగుణంగానే పెట్రోల్‌, డీజీల్ హోం డెలివ‌రి ఉంటుంద‌ని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: