ఓ విషాదకరమైన రోడ్డు ప్రమాదంలో ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ను కోల్పోవడం ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటో హృదయాన్ని బాధలో ముంచెత్తింది. గత వారం రోడ్డు ప్రమాదంలో మరణించిన డెలివరీ బాయ్ సలీల్ త్రిపాఠి భార్య సుచేతా త్రిపాఠికి ఇప్పుడు జొమాటో కంపెనీ ఉద్యోగం కల్పిస్తుంది.జొమాటో కంపెనీ రూ. 10 లక్షల బీమా గ్రాంట్‌ను అందిస్తోంది. ఇంకా ఉద్యోగులందరూ కలిసి ఆ కుటుంబ భవిష్యత్తు కోసం రూ. 12 లక్షలను అందజేస్తారు. జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ గురువారం సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.

ఆయన ఇలా సంతాపం తెలిపారు.“మా డెలివరీ భాగస్వామి సలీల్ త్రిపాఠి దురదృష్టకర రోడ్డు ప్రమాదంలో మరణించినందుకు మేము చాలా తీవ్రంగా బాధపడుతున్నాము. అందువల్ల అతని కుటుంబానికి సహాయం చేయడానికి మేము అన్ని విధాలా సహాయాన్ని అందిస్తున్నాము.” అలాగే కంపెనీ ఇప్పటివరకు తీసుకున్న చర్యలను పంచుకుంటూ, "ఈ సమయంలో మా బృందం వ్యక్తిగతంగా ఆ కుటుంబానికి సహాయం చేస్తోంది. ఇంకా ఆ ప్రమాదం జరిగిన రాత్రి నుండి మేము ఆసుపత్రిలో ఉన్నాము. ఇక ఇప్పటికి కొనసాగుతున్న వారి ఖర్చులకు (అంత్యక్రియల ఖర్చులు మొదలైనవి) మేము సహాయం చేస్తాము." అని తెలిపారు. 

ఇక జొమాటో రూ. 10 లక్షల బీమా గ్రాంట్‌తో ఆ కుటుంబానికి సహాయం చేస్తోందని  ఇంకా వారి కుటుంబానికి మరింత సాయం చేసి సాధ్యమైన అన్ని విధాలుగా వారికి సపోర్ట్ ఇస్తుందని గోయల్ తెలిపారు. "ఇక ఆ కుటుంబానికి ఆసరాగా సలీల్ భార్య సుచేతకు ఉద్యోగం కల్పించడానికి మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాము.అందువల్ల ఈ ఉద్యోగం ఆమె తన ఇంటిని నడపడానికి ఇంకా తన 10 ఏళ్ల కుమారుడి చదువు ముందుకు సాగడానికి తోడ్పడుతుంది." అని అన్నారాయన.

పైన పేర్కొన్న వాటితో పాటు, "జొమాటో ఉద్యోగులు అంతా కలిసి ఆ కుటుంబ భవిష్యత్తు కోసం రూ. 12 లక్షలు ఆర్ధిక సహాయం అందించారు" అని గోయల్ తెలిపారు.సలీల్ కుటుంబం పట్ల తమ ఉద్యోగులు పంచుకున్న అఖండమైన సహాయం ఇంకా సలీల్ కుటుంబం పట్ల వారికి వున్న దయకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ క్లిష్ట సమయంలో వారికి అవసరమైన ఆర్థిక ఇంకా మానసిక సపోర్ట్ ఉందని నిర్ధారించడానికి వారి కుటుంబానికి అండగా ఉంటామని ఆయన చెప్పారు.

ఇక 38 ఏళ్ల డెలివరీ ఎగ్జిక్యూటివ్ సలీల్ గతవారం అనగా జనవరి 8 వ తేదీన రాత్రి వాయువ్య ఢిల్లీలోని రోహిణిలో మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసు వాహనం ఢీకొట్టడంతో హత్యకు గురయ్యాడు. నిందితుడు మరెవరో కాదు. అతను జిలే సింగ్ అనే కానిస్టేబుల్‌ అట. ఇక అతన్ని అదుపులో తీసుకొని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివిధ నగరాలకు చెందిన వారు ఆర్థిక సహాయం అందించడంతో పాటు కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని ఇంకా కానిస్టేబుల్ వల్ల చనిపోయిన వ్యక్తి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: