కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) ఒక మంచి పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకం. ఈ స్కీంలో మీ డబ్బు రెట్టింపు అవ్వడానికి 124 నెలలు (10 సంవత్సరాల 4 నెలలు) పడుతుంది.మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం అనేది లేకుండా ఇందులో హామీ మొత్తం లభిస్తుంది.ఎక్కువ కాలం పాటు పొదుపు చేయాలనుకునే పెట్టుబడిదారులు కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ)లో పెట్టుబడి పెట్టడం చాలా మంచిదే. ప్రభుత్వ గ్యారెంటీ ద్వారా పెట్టుబడి పెట్టబడిన మొత్తం డబ్బు సురక్షితంగా ఉండటమే కాకుండా పెట్టుబడిదారుడు సంపాదించిన వడ్డీ కూడా పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. కేవీపీ సర్టిఫికేట్‌లలో ఒక వ్యక్తి మాక్సిమమ్ లిమిట్ లేకుండా, మినిమం రూ. 1000 పెట్టుబడి పెట్టవచ్చు.ఇప్పుడు ఈ పథకానికి పోస్టాఫీసు ఇస్తున్న వడ్డీరేటు 6.90%. ప్రజలలో దీర్ఘకాలిక ఆర్ధిక క్రమశిక్షణను ప్రోత్సహించడమే పథకం ప్రధాన లక్ష్యం. ఈ స్కీమ్‌లో ఎన్నో రకాల కిసాన్ వికాస్ పత్ర సర్టిఫికెట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి.

సింగిల్ హోల్డర్ టైప్ సర్టిఫికేట్ పెద్ద వారి కోసం జారీ చేయబడుతుంది. మైనర్ తరపున జారీచేసే `కేవీపీ` సర్టిఫికేట్లు కూడా ఇందులో ఉన్నాయి. అంతేగాక పెద్దలకు జాయింట్‌గా జారీ చేయబడే కిసాన్ వికాస్ సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి.ఇక ఈ స్కీమ్ మెచ్యూరిటీ టైమ్ వచ్చి 124 నెలలు ఉంటుంది. ఇక లాక్‌-ఇన్ వ్యవధి 30 నెలలు. మెచ్యూరిటీకి ముందు కూడా `కేవీపీ`ని ఏ కారణం వలనైనా క్లోజ్ చేసుకోవచ్చు. కానీ 30 నెలల తర్వాత మాత్రమే మెచ్యూరిటీ డబ్బుని విత్ డ్రా చేసుకోడానికి అనుమతి ఉంటుంది, దీనికోసం అకౌంట్ హోల్డర్ ధరఖాస్తు ఫారమ్‌-2ను పోస్టాఫీసుకు సమర్పించాలి. కిసాన్ వికాస్ పత్ర స్కీంలో రూ. 1000 ఇన్వెస్ట్ చేస్తే, లాక్‌-ఇన్ పీరియడ్ పూర్తయ్యే సమయానికి, 30 నెలల నుంచి 36 నెలల లోపు విత్‌డ్రా చేస్తే రూ. 1154 డబ్బుని పొందుతారు. 60 నుంచి 66 నెలల లోపు విత్‌డ్రా చేస్తే రూ. 1332 డబ్బు లభిస్తుంది. ఏడున్నర సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల లోపు విత్ డ్రా చేస్తే రూ. 1537 డబ్బు లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: