ఇక ఫేమస్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ (LIC) ఇప్పటికే రకరకాల ఆఫర్లు ప్రకటిస్తూ పాలసీ దారులను ఎంతగానో ఆకట్టుకుంటోన్న విషయం తెలిసిందే. హౌజ్‌లోన్ వంటి ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న ఎల్ఐసీ తాజాగా తన పాలసీ హోల్డర్లకు మరో సదవకాశాన్ని తీసుకొచ్చింది.తన కస్టమర్లకు ఇంకా అలాగే ఏంజెంట్లకు ఉచితంగా క్రెడిట్ కార్డును ఇవ్వనున్నట్లు lic ప్రకటించింది. ఐడీబీఐ బ్యాంక్ సహయంతో ఈ కార్డులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ క్రెడిట్ కార్డుతో అనేక రకాల ప్రయోజనాలు అందనున్నాయి. ఎల్ఐసీ లుమైన్ కార్డు ఇంకా ఎక్లాట్ కార్డుల పేరుతో రెండు కార్డులను తీసుకొచ్చింది. ఇక ఈ lic క్రెడిట్ కార్డుల కోసం కస్టమర్లు ఎలాంటి యాన్యువల్ ఫీజులు కానీ ఇంకా అలాగే ఎలాంటి మెంబర్‌షిప్ ఫీజు కానీ చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎల్ఐసీ అందిస్తున్న ఈ క్రెడిట్ కార్డుల ద్వారా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైన ప్రయోజనాలు ఏంటంటే..ఈ కార్డుల ద్వారా రూ.400 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీ కనుక చేస్తే 1 శాతం ఫ్యూయల్ సర్‌ఛార్జ్ రియంబర్స్‌మెంట్ అనేది ఉంటుంది.ఇక 3000 కంటే ఎక్కువ మొత్తంలో ఏదైనా కొనుగోలు గనుక చేస్తే ఆ మొత్తాన్ని సులభతరమైన ఈఎమ్ఐలకు కన్వర్ట్ చేసుకునే వెసులుబాటును కూడా వీరు కల్పించారు.ఇక ఈ కార్డుతో రూ. 100పై ఖర్చు చేస్తే డిలైట్ పాయింట్లను కూడా పొందవచ్చు. ఎల్ఐసీ కార్డులను పొందిన వారికి రూ. 5 లక్షల దాకా అస్యూర్డ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్‌ను కూడా కంపెనీ వారు అందించనున్నారు. ఇక ఈ క్రెడిట్ కార్డుల లిమిట్ విషయానికి కనుక వస్తే..లూమిన్ క్రెడిట్ కార్డుకు రూ. 50 వేలు ఇంకా అలాగే ఎక్లాట్ క్రెడిట్ కార్డుకు రూ. 2 లక్షలుగా కేటాయించడం జరిగింది.ఇక ఈ రకంగా lic తన కస్టమర్లకు మంచి మంచి ప్రయోజనాలను అందిస్తూ ఎంతగానో ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: