న‌రేంద్ర‌మోదీ ప్ర‌భుత్వం ఇవాళ 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ది. ఉద‌యం 11 గంట‌ల‌కు ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ పార్ల‌మెంట్‌లో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడ‌తారు. ముఖ్యంగా బ‌డ్జెట్‌కు ముందు స్టాక్ మార్కెట్ భారీ క‌ల‌క‌లం రేగుతున్న‌ది. విదేశీ పెట్టుబ‌డిదారులు మార్కెట్ నుంచి డ‌బ్బును తీసుకుంటుండ‌గా.. దేశీయ పెట్టుబ‌డిదారులు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వు వ్యాఖ్యానాల విదేశీ పెట్టుబ‌డి దారుల భార‌తీయ స్టాక్ మార్కెట్ ప‌ట్ల ప్ర‌తికూలంగా మారారు. క‌రోనా నేప‌థ్యంలో మూల‌ధ‌న వ్య‌యం గురించి ప్ర‌క‌టించే అంశంపై అంద‌రి దృష్టి సారించారు.

ఇక వ్యాపారుల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌భుత్వం త‌న ఆదాయ‌, వ్య‌యాల‌ను స‌మ‌తుల్యంగా ఉంచుకోవాల‌ని చూస్తుంద‌ని.. ఈ బ‌డ్జెట్ లో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకోవాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని మోర్గాన్ స్టాన్టీ వివ‌రించారు. వృద్దిపై దృష్టి సారిస్తుంద‌ని యాక్సిస్ సెక్యూరిటీస్ అభిప్రాయం వ్య‌క్తం చేసింది. ముఖ్యంగా మూల‌ధ‌న వ్య‌యంపై ప్ర‌భుత్వం దృష్టిపెట్ట‌నున్న‌ది. మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు భారీ మొత్తం వెచ్చించ‌నున్నారు.

ఆర్థిక స‌మాన‌త్వం

 
ఆర్థిక స‌మాన‌త్వాన్ని తొల‌గించ‌డానికి కృషి చేయాలి. ఈ అంశాన్ని లేవ‌నెత్తుతున్న‌ట్టు బ్రోక‌రేజ్ సైంస్థ షేర్ఖాన్ తెలిపింది. ఇలాంటి ప‌రిస్థితిలో బ‌డ్జెట్‌లో ప్రోత్సాహ‌కాలు, విధాన‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌ను ప్ర‌క‌టించ‌వ‌చ్చు అని వెల్ల‌డించింది. ఈ చ‌ర్య‌ల సాయంతో గ్రామీణ అవ‌స‌రాల డిమాండ్‌ను వేగ‌వంతం చేసేందుకు ప్రభుత్వం ప్ర‌య‌త్నిస్తుంది. ముఖ్యంగా ఆర్‌బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ దువ్వూరి సుబ్బారావు ఆర్థిక అస‌మాన‌త‌లు త‌గ్గించాల‌ని పేర్కొన్నారు.

ద్ర‌వ్య‌లోటు

బ‌డ్జెట్ రోజు ద్ర‌వ్య‌లోటును ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా చేసుకుంటుంద‌నే దానిపై మార్కెట్ ఓ క‌న్ను వేసి ఉంచింది. ప‌న్నుల వసూళ్లు పెరిగితే ద్ర‌వ్య‌లోటు ల‌క్ష్యం త‌క్కువ‌గా ఉంటుంది. ఇది సెంటిమెంట్ పై సానుకూల ప్ర‌భావం చూపుతుంది. 2021-22  ఆర్థిక సంవ‌త్స‌రానికి ఆర్థిక లోటు ల‌క్ష్యాన్ని 6.8 శాతంగా ఉంచారు. 2022-23 సంవ‌త్స‌రానికి ద్ర‌వ్య‌లోటు ల‌క్ష్యం 6 శాతం చేరుకోవ‌చ్చు అని నిపుణులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

మూల ధ‌న వ్య‌యం

దీని పై విశ్లేష‌కులు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా మూల ధ‌న‌వ్య‌యం 6.5 ల‌క్ష‌ల కోట్లు ఉండొచ్చు. ఈ సంవ‌త్స‌రం మూల‌ధ‌న వ్య‌యం 20 శాతం వ‌ర‌కు పెర‌గ‌వ‌చ్చని భావిస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రానికి ల‌క్ష్యం 6.5 కోట్లు. కార్పొరేట్ క్రెడిట్ వృద్ధి సంఖ్య‌లు ప్రోత్సాహ‌క‌రంగా లేవు అని, ఖ‌ర్చుల‌కు దూరంగా ఉన్న‌ట్టు చూపిస్తోంది.

విదేశీ ఇన్వెస్ట‌ర్లు

విదేశీ ఇన్వెస్ట‌ర్లు ప్ర‌తికూల‌మ‌యితే.. విదేశీ పెట్టిబ‌డిదారులు భారతీయ మార్కెట్‌పై ప్ర‌తికూలంగానే ఉన్నారు. విదేశీ ఇన్వెస్ట‌ర్లు ఫిబ్ర‌వ‌రి నెల‌లో 43,506 పాయింట్ల వ‌ద్ద డెరివేటివ్‌ల‌లో బిడ్డింగ్ చేస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి నెల‌లో మార్కెట్‌లో భారీ మెరుగుద‌ల ఉంటుంది. యూఎస్ ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ 2022 ఏడాదిలో వ‌డ్డీ రేటు పెంపుపై నిర్ణ‌యం తీసుకోగ‌ల‌దు అని విదేశీ పెట్ట‌బ‌డిదారులు భావిస్తున్నారు. రిజ‌ర్వ్ వ‌డ్డీ రేటును 5 రెట్లు పెంచ‌గ‌ల‌ద‌ని బ్రోక‌రేజ్ సంస్థ నోమురా అభిప్రాయ ప‌డింది. మార్చిలో ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ వ‌డ్డీని 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్న‌ద‌ని నోమురా వెల్ల‌డించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: