ప్రపంచ దేశాలలో అగ్రగామిగా ఉన్న ప్రముఖ సంస్థల్లో అమెజాన్ కూడా ఒకటి. అయితే ఈ సంస్థలో కీలక పదవి దక్కడం అన్నది నిజంగా గొప్ప అదృష్టమనే చెప్పాలి. ఎంతో ప్రతిభ , నిబద్దత, లక్ ఉంటే కానీ ఇటువంటి బడా సంస్థల్లో దీర్ఘ కాలం కొనసాగలేము. అలాంటిది ఇరవై ఏళ్లకు పైగా అమెజాన్ సంస్థలో పనిచేస్తున్న ఒక కీలక అధికారి ఇపుడు పదవి నుండి తప్పుకున్నారు. ఇ-కామర్స్ జెయింట్ అమెజాన్ కీలక అధికారి డేవ్ క్లార్క్ తన పదవికి రాజీనామా చేసినట్లు కీలక ప్రకటన చేశారు. రెండు దశాబ్దాలకు పైగా అమెజాన్‌లో కీలక బాధ్యతలు పోషించిన క్లార్క్ ఇపుడు తన బాధ్యతల నుండి తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా ఆయన ఈ విషయాన్ని సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. అంతేకాదు ఆయన రాజీనామా లేఖను సంస్థ అధినేత జెఫ్ బెజోస్ మరియు ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ తదితర సంస్థ ప్రముఖ ప్రతినిదులకు  మెయిల్ చేశారు. అలాగే ఆయన రాజీనామా లేఖను తన  మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ లో పోస్ట్ చేసి వివరాలు తెలిపారు.  జులై 1వ తేదీన తాను సంస్థ నుండి వైదొలగనున్నట్లు డేవ్ క్లార్క్ వెల్లడించారు. 1999లో అమెజాన్ సంస్థలో జాయిన అయిన ఆయన 20 సంవత్సరాలకు  పైగా డేవ్ క్లార్క్ ఈ సంస్థతో అసోసియేట్ అయి ఒక్కో మెట్టు ఎక్కుతూ గొప్ప పొజిషన్ కి చేరుకున్నారు. ప్రస్తుతం అమెజాన్ వరల్డ్‌వైడ్ కన్జ్యూమర్ బిజినెస్ విభాగానికి డేవ్ క్లార్క్ హెడ్ గా చేస్తుండగా ఇపుడు ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.

అమెజాన్ సంస్థ ను  ప్రపంచ నలుమూలలకు విస్తరింప చేయడంలో ఆయన ముఖ్య భూమిక పోషించారని చెప్పాలి.
ఈయన 23 ఏళ్ల  కిందట ఈ కంపెనీలో చేరేటప్పటికి ఇది ఒక సాధారణ స్టార్టప్‌గా ఉండేదట.. అయితే నేడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సంస్థ నెట్‌వర్క్‌ను ప్రపంచ వ్యాప్తంగా విస్తరింప జేయడానికి అంతా కలిసి కట్టుగా ఎంతగానో శ్రమించామని చెప్పుకొచ్చారు. తన తోటి వారు సహాయ సహకారాలు అందించడం లో ఎపుడు ముందుందేవారు.  అమెజాన్‌తో కలిసి సాగిన ప్రయాణం నిజంగా ఓ అద్భుతం, అదృష్టం అని తెలిపారు . అయితే ఇపుడు సంస్థ నుండి పక్కకు తప్పుకోవాల్సి సమయం ఆసన్నమయింది అన్నారు .  అయితే ఈ రంగం లో ఎంతో అనుభవం ఉన్న డేవ్ క్లార్క్  సొంతంగా ఓ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ను స్థాపించడానికి ఇపుడు ఈ సంస్థ నుండి వైదొలిగారు అని అనుకుంటున్నారు కానీ అసలు విషయంపై క్లారిటీ రాలేదు. ఇది జెఫ్ బెజోస్ అండ్ టీమ్ కు బిగ్ షాక్ అని చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: