ఇప్పుడు స్మార్ట్‎ఫోన్ అనేది చేతిలో ఉండటంతో ఏం కావాలన్నా కూడా ప్రజలు ఇంట్లోనే కూర్చొని ఫోన్‎తోనే ఆర్డర్ చేసుకుంటున్నారు. ఫుడ్, కూరగాయలు ఇంకా అలాగే ఇంట్లోకి కావాలసిన వస్తువులు, బట్టలు, ఫోన్లు..ఇక ఇలా ఏది కావాలన్నా కూడా ఈజీగా స్మార్ట్ ఫోన్‎తోనే బుక్ చేసుకుంటున్నారు. కరోనా వైరస్ మహమ్మారీ వచ్చినప్పటి నుంచి ఈ విధానానికి జనాలు బాగా అలవాటుపడిపోయారు. తాజాగా ఇప్పుడు మరో సౌకర్యం కూడా ఆన్‎లైన్‎లో అందుబాటులోకి వచ్చింది. ఇకనుంచి ఇంట్లో నుంచే ఫోన్ ద్వారా పెట్రోల్ ఇంకా అలాగే డీజిల్ కూడా ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు.మొబైల్‌ యాప్‌ సహాయంతో గోఫ్యూయెల్‌ ఇండియా అనే సంస్థ ఇంటి వద్దకే డీజిల్ ఇంకా పెట్రోల్‌ను సరఫరా చేయనుంది. దీనికి సంబంధించిన కార్యకలాపాలను సంస్థ కోఫౌండర్‌ ఆదిత్య మీసాల శుక్రవారం నాడు హైదరాబాద్‎లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'హెచ్‎పీసీఎల్, ఐఒసీఎల్ ఇంకా బీపీసీఎల్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ సేవలు ఇప్పటికే చెన్నైలో అందరికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. అక్కడ వ్యాపారం ప్రారంభించిన ఏడాదిలోనే మొత్తం రూ. 20 కోట్లకు పైగా బిజినెస్ చేశాం. ఇక అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది.


అందుకే ఇప్పుడు హైదరాబాద్‎లో కూడా మా సేవలను ప్రారంభిస్తున్నాం. ఫ్యూయల్ ఆర్డర్ కోసం 'గో ఫ్యూయల్' మొబైల్ యాప్ ని అందుబాటులోకి తీసుకొచ్చాం.ఇక ఈ యాప్ ద్వారా ఆర్డర్ చేస్తే వారు కోరుకున్నచోటుకి ఫ్యూయల్ డెలివీరీ చేస్తాం.మొత్తం 20 లీటర్ల నుంచి 10 వేల లీటర్ల వరకు ఎంతైనా సరఫరా చేస్తాం. వచ్చే రెండు మూడు నెలల్లో గువాహటి ఇంకా అలాగే సేలంలో కూడా మా కార్యకలా పాలను ప్రారంభిస్తాం. 2024 వ సంవత్సరం నాటికి దేశమంతటా కూడా 1,000 వాహనాలతో సంస్థను విస్తరింపచేయాలని మేము అనుకుంటున్నాం. ఇంకా అలాగే త్వరలోనే ఎలక్ట్రిక్ రంగంలోకి కూడా ప్రవేశిస్తాం' అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోఫ్యూయెల్‌ ఫ్రాంచైజీ భాగస్వాములైన హెచ్‌పీసీఎల్‌ సీజీఎం హరిప్రసాద్‌ సింగు పల్లి ఇంకా అలాగే సుస్మిత ఎంటర్‌ప్రైజెస్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: