ఇక చాలాసార్లు కూడా మనం లావాదేవీలు నిర్వహించేందుకు బ్యాంకుకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి సమయంలో బ్యాంకు అధికారులు ఖచ్చితంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు.ఇంకా అలాగే చాలా అమర్యాదగా కూడా ప్రవర్తిస్తారు. అంతేకాదు లంచ్‌ టైం అంటూ మరేదో సాకు చెబుతూ పని నుంచి తప్పించుకుంటారు. ఇంకా గంటల తరబడి ఆలస్యం చేస్తారు. ఇలాంటి ఇబ్బందిని ఖాతాదారులు ఎదుర్కొన్నట్లయితే ఇక ఊరికే ఉండనవసరం లేదు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం పై అధికారులకి ఈజీగా ఫిర్యాదు చేయవచ్చు. ఇక దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.చాలామంది ఖాతాదారులకి పాపం ఈ విషయం తెలియదు. కానీ మీ హక్కుల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు ఖచ్చితంగా ఉంది. కస్టమర్‌లు బ్యాంకింగ్ సేవలకు సంబంధించి ఖచ్చితంగా కొన్ని హక్కులను పొందారు.ఇక మీ పట్ల బ్యాంకు ఉద్యోగులు సక్రమంగా ప్రవర్తించక పోతే మీరు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కి మీరు ఫిర్యాదు చేయవచ్చు. ఏదైనా బ్యాంక్ ఉద్యోగి మీ పని చేయడంలో కనుక ఆలస్యం చేస్తే మీరు ఆ బ్యాంక్ మేనేజర్ లేదా నోడల్ అధికారికి వెంటనే ఫిర్యాదు చేయవచ్చు.


కస్టమర్ ఫిర్యాదులను పరిష్కరించేందుకు దాదాపు ప్రతి బ్యాంకులో కూడా ఫిర్యాదుల పరిష్కార ఫోరమ్ ఉంటుంది. ఇక్కడ మీరు మీ ఫిర్యాదును సమర్పించవచ్చు. మీరు ఏ బ్యాంకు ఖాతాదారునిగా ఉన్నారో ఆ బ్యాంకు గ్రీవెన్స్ రిడ్రెసల్ నంబర్ ని తీసుకొని సంబంధిత ఉద్యోగికి ఫిర్యాదు చేయవచ్చు. ఇది కాకుండా మీరు బ్యాంకు టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా కూడా మీ సమస్యను చెప్పవచ్చు.కొన్ని బ్యాంకులు అయితే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నాయి.ఉదాహరణకు బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లు ఏదైనా శాఖలోని ఉద్యోగి గురించి టోల్ ఫ్రీ నంబర్ 1800-425-3800 లేదా 1-800-11-22-11కి ఫిర్యాదు చేయవచ్చు. ఇంకా అదే సమయంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కస్టమర్ అయితే బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్ లేదా అప్పీలేట్ అథారిటీని కూడా సంప్రదించవచ్చు.అంతేకాదు మీకోసం డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్ https://cms.rbi.org.in ఓపెన్ చేసే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: