ఇక దేశవ్యాప్తంగా కూడా ఆయా రాష్ట్రాల్లో ఇల్లు లేనివారికి, అభాగ్యులకు, వలసదారులకు ఇంకా అలాగే కొత్తగా పెళ్లైన జంటలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను చెప్పింది. అర్హులైన అందరికి కూడా రేషన్ కార్డులను అందించేందుకు కామన్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీని కేంద్ర ప్రభుత్వ అధికారులు శుక్రవారం నాడు ప్రారంభించడం జరిగింది.ఇక ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ వెబ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను స్టార్ట్ చేశారు. ఈ ప్రక్రియ ద్వారా ఇల్లు లేనివారు, అభాగ్యులు ఇంకా వలసదారులు అలాగే కొత్తగా పెళ్లైన జంటలు కూడా రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు.ఇంకా అంతేకాదు, ఈ నెలాఖరు నాటికి దేశంలో ఉన్న అన్నీ రాష్ట్రాల్లో కూడా ఈ కామన్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీని అమలు చేయనున్నామని ఓ ప్రకటనలో కూడా పేర్కొన్నారు. అర్హులైన వారిని చాలా వేగంగా గుర్తించి రేషన్ కార్డులు అందించడంలో రాష్ట్రాలకు సహకారం అందించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చాయని తెలిపారు.


వలసదారులు ఇంకా అలాగే ఇతర లబ్దిదారులు ఎవరి సాయమైనా కానీ తీసుకొని కామన్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీలో తమ వివరాలు నమోదు చేసుకొని రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివరించడం జరిగింది.ఇక అనంతరం దరఖాస్తులు చేసుకున్న ఆ పత్రాలను వెరిఫికేషన్ కోసం సంబంధిత రాష్ట్రాలకు పంపిస్తామని, ఇంకా వారు రేషన్ కార్డు పొందాక.. 'వన్ నేషన్ వన్ రేషన్' కార్డు ప్రోగ్రామ్ కింద దేశంలోని ఏ రేషన్ షాపులోనైనా కూడా ఆహారధాన్యాలు తీసుకోవచ్చని అధికారులు వివరాలను వెల్లడించడం జరిగింది.అయితే, ఈ కొత్త రేషన్ కార్డులకు సంబందించిన వెబ్సైటు ఇంకా అలాగే దరఖాస్తు విధానం, ఆ 11రాష్ట్రాల వివరాలను అతి త్వరలోనే వెల్లడిస్తామని తెలిపడం జరిగింది.ఇది నిజంగా రేషన్ కార్డు లేనివారికి మంచి న్యూస్ అని చెప్పాలి. కాబట్టి రేషన్ కార్డ్ లేనివారు అభాగ్యులు, వలసదారులు, ఇల్లు లేనివారు దీనికోసం అప్లై చేసుకోవడానికి సిద్ధంగా వుండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: