ఒకప్పుడు డబ్బులు వేరే పంపడమో లేక వేరే వాళ్ళ నుంచి తీసుకోవాలంటే బ్యాంకుకి వెళ్లి అక్కడ గంటలు గంటలు నిలబడి ట్రాన్సక్షన్స్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చాక ప్రతీది చాలా ఈజీగా అయిపోయింది.యూపీఐ పేమెంట్ అనేది ప్రస్తుత కాలంలో జనాలకు చాలా ఉపయోగపడే టెక్నాలజీ. దీనివల్ల సమయం చాలా ఆదా అవుతుంది. బ్యాంకులకి వెళ్లకుండానే ట్రాన్సక్షన్స్ చేసుకోవచ్చు. అయితే ఇక ఈ యూపిఐ ద్వారా పేమెంట్స్ చేయడానికి మరో సూపర్ ఫీచర్ కూడా అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా యూపీఐ పేమెంట్ చేయాలంటే స్మార్ట్ ఫోన్ ఉండాలి. కానీ 'యూపీఐ 123పే' సేవలను ప్రారంభించిన తర్వాత ఫీచర్ ఫోన్ వినియోగదారులకూ ఆ యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి.ఇక నుంచి ఫీచర్ ఫోన్ వినియోగదారులు తమకు నచ్చిన భాషలో మాట్లాడి యూపీఐ చెల్లింపులు చేయొచ్చు. ఇందుకోసం టోన్‌ ట్యాగ్ సంస్థ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ సంస్థ దేశంలోని పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల భాగస్వామ్యంతో 'యూపీఐ 123 పే' సేవలను మార్చిలో ప్రారంభించింది.


 ప్రస్తుతం టోన్ ట్యాగ్‌ ఫస్ట్ వాయిస్‌ సొల్యూషన్‌తో ఈ సేవలను మరింత విస్తరించనున్నట్లు పేర్కొంది.గ్రామీణ భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను పెంచడానికి టోన్‌ట్యాగ్ వాయిస్-ఫస్ట్ సొల్యూషన్ ప్రాంతీయ భాషలలో తీసుకొచ్చినట్లు తెలిపింది. టోన్‌ట్యాగ్ ద్వారా హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ వంటి భాషల్లో కేవలం వాయిస్‌తో డిజిటల్ చెల్లింపులు చెయ్యొచ్చు. త్వరలో గుజరాతీ, మరాఠీ, పంజాబీ భాషలలో కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ఆ సంస్థ పేర్కొంది.చెల్లింపుల కోసం వినియోగదారులు 6366 200 200 ఐవీఆర్ నంబర్‌కు కాల్ చేసి వారి ప్రాంతీయ భాషను ఎంపిక చేసుకోవాలి. అయితే ఈ సేవతో వినియోగదారులు నిధులను బదిలీ చేయలేరట. కేవలం యుటిలిటీ బిల్లు చెల్లింపులు, బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఫాస్ట్‌ట్యాగ్ యాక్టివేషన్ లేదా రీఛార్జ్ వంటివి వాయిస్ ఉపయోగించి చాలా ఈజీగా చేయవచ్చట.


మరింత సమాచారం తెలుసుకోండి:

UPI