ఫేమస్ ఎలక్ట్రానిక్‌ కంపెనీ అయిన సామ్‌సంగ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీవీల నుంచి స్మార్ట్‌ఫోన్‌ల వరకు అన్ని రకాల గ్యాడ్జెట్లను కూడా ఈ కంపెనీ తయారు చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటుంది.చాలా దేశాల్లో కూడా ఈ బ్రాండ్‌కు చాలా మంచి వ్యాల్యూ ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు వస్తువుల తయారీ రంగంలో ఉన్న సామ్‌సంగ్‌ తాజాగా ఫైనాన్సియల్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగానే క్రెడిట్ కార్డులను తీసుకొస్తోంది. ప్రముఖ ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ అయిన యాక్సిస్‌, వీసాతో కలిసి సామ్‌సంగ్‌ ఈ కార్డును తీసుకొస్తోంది.ఈ క్రెడిట్‌ కార్డులతో ట్రాన్సాక్షన్స్‌ చేసే యూజర్లకు భారీ క్యాష్‌బ్యాక్‌లు, ఆఫర్లను అందించనున్నట్లు సామ్‌సంగ్ తెలిపింది. ఈ క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే ఏడాది మొత్తం 10 శాతం క్యాష్‌బ్యాక్‌ అందించనుంది. ఈఎంఐ, నాన్‌ ఈఎంఐ ట్రాన్సక్షన్స్‌ అన్నింటికీ ఈ ఆఫర్‌ వర్తిస్తుందని సామ్‌సంగ్ తెలిపింది.


అన్ని రకాల సామ్‌సంగ్‌ ప్రొడక్ట్స్‌తో పాటు ఇతర ప్రొడక్టలపై కూడా ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఇక సామ్‌సంగ్‌ ఆథరైజ్డ్‌ సర్వీస్‌ సెంటర్‌లలో కూడా ఆఫర్లు పొందొచ్చు.సామ్‌సంగ్‌ క్రెడిట్‌ కార్డును వీసా సిగ్నేచర్‌, వీసా ఇనిఫినిటీ పేర్లతో విడుదల చేస్తోంది. వీసా సిగ్నేచర్ క్రెడిట్ కార్డుపై నెలవారీగా రూ.2,500తోపాటు ఏడాదిలో రూ.10 వేల వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. వీసా ఇనిఫినిటీ కార్డుపై నెలవారీగా రూ.5000తోపాటు ఏడాదిలో రూ.20 వేల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. ఈ కార్డులతో కొనుగోలు చేసే ప్రతీ దానిపై ఎడ్జ్‌ రివార్డు పాయింట్లు పొందొచ్చు. ఇక వార్షిక ఫీజు విషయానికొస్తే సిగ్నేచ్‌ కార్డుకు రూ. 500, ఇనిఫినిటీ కార్డుకు రూ. 5000గా ఉంది.కాబట్టి క్రెడిట్ కార్డ్ అంటే ఆసక్తి వున్న అభ్యర్థులు ఈ క్రెడిట్ కార్డును కూడా అప్లై చెయ్యండి.సామ్‌సంగ్‌ కంపెనీ అందించే బెనిఫిట్స్ ని మీరు కూడా పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: