నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రంగాల వారికి ఉపయోగపడే ఎన్నో మంచి మంచి పథకాలను ప్రవేశపెడుతోంది.ఇక పెన్షన్‌దారులకు పెన్షన్‌ స్కీమ్‌ను కూడా ప్రవేశపెట్టింది. ప్రధాన మంత్రి వయ వందన యోజన అనే మంచి పథకంని అమలు చేస్తోంది.ప్రధాన మంత్రి వయ వందన యోజన అనేది చాలా మంచి పథకం. ఇది ఒక సామాజిక భద్రతా పథకం. దీని కింద దరఖాస్తుదారునికి వార్షిక, త్రైమాసిక లేదా నెలవారీ పెన్షన్ ఇవ్వాలని రూల్ ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) నిర్వహిస్తుంది. 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు ఈ పథకంలో చేరడానికి అర్హులు. ఈ పథకం కింద వారు మాక్సిమం రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇంతకుముందు ఈ పథకంలో కేవలం రూ. 7.5 లక్షలు మాత్రమే పెట్టుబడి ఉండేది. తర్వాత ఈ మొత్తాన్ని కూడా డబుల్‌ చేసింది కేంద్రం.


భార్యాభర్తలిద్దరూ కూడా ఈ పథకంపై వార్షిక వడ్డీ 7.40 శాతం పొందుతారు. పెట్టుబడిదారుడి వార్షిక పెన్షన్ మొత్తం రూ.51 వేలు అవుతుంది. మీరు ఈ పెన్షన్‌ను నెలవారీగా తీసుకోవాలనుకుంటే ప్రతి నెలా కూడా మీకు పెన్షన్‌గా రూ.4100 అందుతుంది. ప్రతి నెల రూ.1,000 పెన్షన్ పొందడానికి మీరు ఇందులో రూ.1.62 లక్షలు పెట్టుబడి పెట్టాలి. ఈ పథకం కింద మాక్సిమం రూ.9250 పెన్షన్ పొందవచ్చు. అయితే దీని కోసం మీరు ఖచ్చితంగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టాలి.ఇక ఈ పథకంలో మీ పెట్టుబడి వచ్చేసి 10 సంవత్సరాలు ఉంటుంది. మీకు 10 సంవత్సరాల పాటు వార్షిక లేదా నెలవారీ పెన్షన్ అనేది ఇవ్వబడుతుంది. మీరు ఈ పథకంలో 10 ఏళ్ల పాటు కొనసాగితే తర్వాత మీ పెట్టుబడి మీకు మళ్ళీ తిరిగి వస్తుంది. ఇక మీరు ఎప్పుడైనా కూడా ఈ ప్లాన్‌లో సరెండర్ చేయవచ్చు. దీని గురించి మీకు పూర్తి వివరాలు కావాలంటే దగ్గర్లో ఉన్న బ్యాంకుల్లో గానీ, పోస్టాఫీసుల్లో గానీ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: