పీ ఎఫ్‌ వల్ల చాలా రకాల లాభాలున్నాయి. ఇక ఈపీఎఫ్‌ అకౌంట్ కలిగిన ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) నిర్వహించే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ (ఈడీఎల్‌ఐ) స్కీమ్‌కు అర్హులు.అంటే ఈపీఎఫ్ అకౌంట్ ఉంటే చాలు ఈడీఎల్ఐ స్కీమ్‌కు ఖచ్చితంగా అర్హత సాధించినట్లే. అసలు ఈ ఈడీఎల్ఐ స్కీమ్ అంటే ఏమిటనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఈ స్కీమ్ గురించి తెలిసినవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇది ఒక బీమా పథకం. అంటే ఈపీఎఫ్ ఖాతాదారులందరికీ కూడా ఈపీఎఫ్ఓ అందించే చక్కటి బీమా ప్రయోజనం. ఈ మధ్య ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్‌లో కొన్ని సవరణలు చేసింది ఈపీఎఫ్ఓ. ఎక్కువ మంది పీఎఫ్ ఖాతాదారులకు ఈ బీమా లాభాలు అందించేందుకు ఈపీఎఫ్ఓ అధికారులు ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఇక ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ చనిపోవడానికి ముందు 12 నెలల కాలంలో ఒకటి కన్నా ఎక్కువ కంపెనీల్లో పనిచేసి సర్వీసులో చనిపోయినట్లయితే వారి కుటుంబ సభ్యులకు కూడా బీమా ప్రయోజనం కల్పించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది.


ఇక ఈ స్కీమ్ ద్వారా మొత్తం రూ.2.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు కూడా ఉచితంగా బీమా పొందే అవకాశం అనేది దక్కుతుంది. ఈపీఎఫ్ ఖాతాదారులు సర్వీసులో ఉండగా చనిపోతే ఆ నామినీకి ఈ బీమా మొత్తం డబ్బు లభిస్తుంది.ఇక ఈ ఈడీఎల్ఐ స్కీమ్ నెలకు బేసిక్ సాలరీ రూ.15,000 లోపు ఉన్న వారందరికీ కూడా వర్తిస్తుంది. బేసిక్ సాలరీ రూ.15,000 దాటితే మాక్సిమం రూ.7 లక్షల వరకే బీమా ఉంటుంది. ఈడీఎల్ఐ స్కీమ్‌లో చేరడానికి ఉద్యోగులు డబ్బులు చెల్లించాల్సిన పని కూడా లేదు. ఎంప్లాయర్ మాత్రం బేసిక్ సాలరీలో 0.5% లేదా మాక్సిమం రూ.75 ప్రతీ నెల కూడా చెల్లించాలి. ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ కనుక సర్వీసులో మరణిస్తే నామినీ ఈ బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందుకోసం చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికెట్, ఫామ్ 5 ఐఎఫ్  ఇంకా అలాగే నామినీ అకౌంట్‌కు చెందిన క్యాన్సల్డ్ చెక్ కావాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

EPF