మనం నిత్యం చూసే వృక్షాలు, పువ్వులు, కాయల్లో ఎన్నో ఔషదాలు దాగి ఉన్నవిషయం తెలియదు. అయితే పురాతన కాలం నుండి భారతదేశంలో అనేక ఆయుర్వేద మందులను మూలికలు మరియు వేర్లను ఉపయోగించి తయారుచేస్తున్నారు. కొన్ని పూలల్లో కూడా అద్భుతమైన ఔషదాలు దాగి ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి మందార ఒకటి. మందార పువ్వు ఎరుపు, తెలుపు, పసుపు, పింక్ రంగులలో ఉంటుంది.  ఆయుర్వేదం మందులలో ఎక్కువగా ఎరుపు రంగు మందార పువ్వులను ఉపయోగిస్తారు.

మందార రసం రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మందార పువ్వు రేకలు మరియు ఆకుల వలన ఉన్న  ఉపయోగాల గురించి తెలుసుకుందాం. మందారను ఉపయోగించటానికి ముందు, వాటిని శుభ్రం చేసి ఫ్రిజ్ లో ఉంచాలి.మందార మొక్క నుంచి లభించే ఆకులు, పువ్వులు కూడా సౌందర్యాన్ని పరిరక్షించేందుకు ఎంతగానో తోడ్పతాయి. ఈ మొక్క నుంచి నూనె తీస్తారు. మందార నూనెతో తలవెంట్రుకలను కాపాడుకోవడమే కాక చర్మ రక్షణకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మందార నూనెలో తేమ ఉంటుంది. కనుక చర్మం, కేశాలను మృదువుగా ఉంచేందుకు తోడ్పడుతుంది. మందార నూనె కలిపిన నూనె కేశాలకు రాస్తే ఆ కేశాలకు మరింత అందాన్ని, మెరుపుని ఇస్తుంది.

ఈ నూనెతో మసాజ్‌ చేస్తే చుండ్రు నివారించుకోవచ్చు. జుట్టు రాలటం తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కేశాలు తెల్లబడకుండా ఉండేందుకు ఉపకరిస్తుంది. అంతేకాక దృఢంగా ఉండేందుకు మెరుపుతో ఉంచేందుకు ఈ నూనె ఉపయోగపడుతుంది. కేశాలకు వృధాప్య చాయలు దరి చేరకుండా చూస్తుంది. చర్మం నునుపుగా ఉండేలా చూస్తుంది. చర్మంలో మృత కణజాలం లేకుండా చేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: