ఈ మద్య కాలంలో మనం తినే ఆహార పదార్థాల వల్ల (జంగ్ ఫుడ్స్) తో శరీరంలో రక రకాల మార్పులు సంబవిస్తున్నాయి. ముఖ్యంగా యువతీ యువకులకు మొటిమల ఇబ్బంది మరీ ఎక్కువ అవుతుంది. సాధారణంగా యుక్త వయసు వచ్చిన వారికి మొటిమలు అనేవి సహజంగా వస్తుంటాయి. వీటి నివారణకు  అనేక రకాల క్రీమ్స్ ఉపయోగించి విసిగిపోయారా? అయితే ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే పదార్దాలను ఉపయోగించి మొటిమల సమస్య నుండి బయట పడవచ్చు. నిమ్మకాయలో ఉన్న లక్షణాలు మొటిమలను తగ్గించటంలో సహాయపడతాయి. ఇప్పుడు మొటిమల నివారణకు నిమ్మతో తయారుచేసే ఫేస్ పాక్స్ గురించి తెలుసుకుందాం.


కొంచెం పెరుగులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే మొటిమలు మరియు మచ్చలు తగ్గుతాయి.


ఒక స్పూన్ పచ్చి శనగల పొడిలో నిమ్మరసం కలిపి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని మొటిమల ప్రభావిత ప్రాంతంలో రాసి ఆరిన తర్వాత కడగాలి. చర్మం పొడిగా అన్పిస్తే మాయిశ్చరైజర్ రాయాలి. ప్రతి రోజు ఈ ప్యాక్ ముఖానికి వేస్తే  మంచి పలితం కనపడుతుంది. 


ఒక బౌల్ లో రెండు స్పూన్ల నిమ్మరసం, ఒక గుడ్డు తెల్లసొన వేసి బాగా కలిపి మూడు బాగాలుగా చేయాలి. ఈ మిశ్రమంలో ఒక బాగాన్ని ముఖానికి రాసి ఐదు నిముషాలు అయ్యాక రెండో బాగాన్ని రాసి మరో ఐదు నిముషాలు అయ్యాక మూడో బాగాన్ని రాయాలి. మూడో పొర ఆరిపోయాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.


ఒక స్పూన్ తేనెలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి మొటిమల ప్రభావిత ప్రాంతంలో రాసి ఐదు నిమిషాల తర్వాత సాదారణ నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే మంచి పలితం కనపడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: