మనం ఎంత అందంగా ఉన్నా ఒకోసారి మొఖం జిడ్డు పడితే చూసే వారికి చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. జిడ్బు మొఖం అని కామెంట్ చేస్తు చాలా భాదనిపిస్తుంది. అయితే ఈ జిడ్డు చర్మం ఉన్నవారు ఎన్ని ఫేస్ క్రీమ్ లు వాడినా ప్రయోజనం మాత్రం శూన్యం. ఆకర్షణీయంగా కనిపించాలంటే ప్రత్యేక పోషణ మరియు సరైన శ్రద్ధ అవసరం.  జిడ్డు చర్మ చికిత్సలో పండ్లు చాలా బాగా సహాయపడతాయి. ఇప్పుడు జిడ్డు చర్మాన్ని వదిలించుకోవటానికి కొన్ని చిట్కాలు చూద్దామా..!


జిడ్డు చర్మ చికిత్సలో పండ్లు చాలా బాగా సహాయపడతాయి. ఇప్పుడు జిడ్డు చర్మాన్ని వదిలించుకోవటానికి కొన్ని పండ్ల ఫేస్ పాక్స్ గురించి తెలుసుకుందాం.


స్ట్రాబెర్రీ జిడ్డు చర్మ చికిత్సలో బాగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కొన్ని స్ట్రాబెర్రీలను మెత్తగా చేసి, దానిలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఈ ప్యాక్ జిడ్డు చర్మాన్ని మృదువుగా చేయటమే కాక, ముడతలు, వృద్ధాప్య లక్షణాలను నిరోదిస్తుంది.


ఆరెంజ్ లో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన వృద్ధాప్య లక్షణాలను నిరోదించటానికి మరియు జిడ్డును తొలగించటానికి సహాయపడుతుంది. అంతేకాక చర్మం యవ్వనంగా కనపడటానికి సహాయపడుతుంది. ఆరెంజ్ రసాన్ని ముఖానికి నేరుగా రాయవచ్చు. లేదా వేరే పదార్దాలను కలిపి కూడా రాయవచ్చు.


నిమ్మకాయలో సహజమైన బ్లీచింగ్ లక్షణాలు ఉండుట వలన ఫేస్ పాక్స్ లో ప్రధాన పదార్దంగా ఉపయోగిస్తారు. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించటమే కాక అధికంగా ఉన్న నూనెను తొలగిస్తుంది. నిమ్మరసంలో పసుపు కలిపి ముఖానికి రాస్తే మంచి పలితం కనపడుతుంది.


దోసకాయ జిడ్డును తొలగించటానికి ఉత్తమమైన ఫేస్ ప్యాక్ అని చెప్పవచ్చు. ఇది నల్లని మచ్చలను తొలగించి చర్మం ప్రకాశవంతంగా కనిపించటానికి సహాయపడుతుంది. దోసకాయ రసంలో కొన్ని చుక్కల నిమ్మరసం,చిటికెడు పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: