మనం తీసుకునే ఆహార పధార్థాలలో అన్నిర కాల పోషక విలువలుండే ఆహార పధార్థాలుంటాయి. ఇవి ఆరోగ్య, శరీర సౌందర్యాన్ని ఇనుమడింపచేస్తాయి. ఇందులో ప్రధానంగా పెరుగు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. లాభాలుచాలా రకాలన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పెరుగులో నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పూసుకుని 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే శరీర చర్మం మృదువుగా మారి కాంతివంతంగా తయారవుతుంది.  


తలస్నానం చేసేందుకు ఓ గంట ముందుగా తలకు పెరుగును బాగా పట్టించి తల స్నానం చేసినట్లయితే. మళ్లి విడిగి కండీషనర్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. అలాగే పెరుగులో తేనెను కలిపి పూసినా చక్కని కండీషనర్ లా ఉపయోగపడుతుంది. పెరుగులో శనగపిండని కలిపి, నలుగు పిండిలా శరీరానికి పట్టిస్తే.. చర్మం, మీదనున్న మృత కణాలు తొలగిపోతాయి.


పెరుగులో నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి ఓ 20 నిమిషాలు తరవాత చల్లని నీటితో కడిగితే శరీరం, చర్మం మృదువుగా మారి కాంతివంతం అవుతుంది. పెరుగులో కాస్త పచ్చి పసుపును వేసి, కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాల పై రాస్తే నలుపుదనం తగ్గుతుంది. ఎండలోంచి నీడలోకి వెళ్లగానే పెరుగులో ఐస్ క్యూబ్ లు వేసి ఆ మిశ్రమంతో ముఖానికి మసాజ్ చేస్తే ఎండకు కమిలిన చర్మానికి ఉపశమనం లభిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: