ముఖ్యంగా నగరాల్లో జీవించే వారిలో చాలామందికి ఒత్తిడిలో కూడిన జీవన విధానం వల్ల సరిపడా నిద్ర ఉండదు. అలాగే జంక్‌ఫుడ్స్, నికోటిన్, కెఫిన్, ఆల్కహాల్ వాడకం వంటివి పెరిగాయి. జంక్‌ఫుడ్స్ ద్వారా విషపదార్థాలు శరీరంలోకి చేరతాయి. వీటిని బయటకు పంపేయాలి. లేదంటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే అందుకే రోజుకి ఐదారుసార్లు రకరకాల జ్యూస్‌లు తాగాలి. నిమ్మరసంతో మొదలుపెట్టాలి. రెండు గ్లాసుల నిమ్మరసం తాగిన తర్వాత కూరగాయల జ్యూస్ తీసుకోవాలి. తరువాత బత్తాయి రసం తాగాలి. టమాటో, కారెట్, బీట్‌రూట్ జ్యూస్‌లను మధ్యాహ్నం భోజనానికి రెండు, మూడు గంటల ముందు ఇవి తీసుకోవాలి. మధ్యాహ్నం పుచ్చకాయ, సాయంత్రం తోటకూర లేదా దోసకాయ జ్యూస్ తీసుకోవాలి. నిద్రకు ఉపక్రమించే ముందు బత్తాయి, యాపిల్, ద్రాక్షలను కలిపి జ్యూస్ చేసి తాగాలి. ఇలా మూడు రోజుల పాటు ఆచరించాలి. తర్వాత రోజుల్లో తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి.


ఆహారంతో పాటు జ్యూస్‌లు కూడా రోజుకు ఒకటి, రెండు సార్లు తాగాలి. తర్వాత అలవాటు పడ్డ ఆహారం తీసుకున్నా, శరీరంలోకి విషపదార్థాలు మాత్రం చేరకుండా జాగ్రత్తపడాలి. పౌష్టికాహారం తినడంవల్ల శక్తి ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఈ థెరపీలో ఏయే జ్యూస్‌లు ఎలాంటి ఆరోగ్యాన్ని యిస్తుందో మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.


యాపిల్ జ్యూస్: చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. హార్ట్ ఎటాక్‌లు, స్ట్రోక్‌లు రాకుండా నివారిస్తుంది. ఆరోగ్యకమరైన శీరానికి మరియు ప్రకాశించే చర్మానికి భరోసా పండ్లు మరియు కూరగాయలే....


గ్రేప్ జ్యూస్ (ద్రాక్షరసం): ఇది అధిక రక్తపీడనాన్ని తగ్గిస్తుంది. ధమనుల గోడలకు విశ్రాంతినిచ్చి, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కార్డియోవాస్కులార్‌ను సంరక్షిస్తుంది.


బొప్పాయి జ్యూస్: జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యల్ని తగ్గిస్తుంది. యాంటి బయాటిక్ మందులు వాడిన తర్వాత శరీరంలోని మంచి బాక్టీరియా నశిస్తుంది. దాన్ని తిరిగి ఏర్పరిచేందుకు బొప్పాయి జ్యూస్ ఉపయోగపడుతుంది.


లెమన్ జ్యూస్ (నిమ్మరసం): బరువు తగ్గడానికి బాగా పనిచేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. మలబద్ధకాన్ని, డయేరియాను అదుపులో ఉంచుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండటంవల్ల రక్తపరిశుభ్రతకు పనిచేస్తుంది. కడుపులో వాయువు, మంటను తగ్గిస్తుంది. ఆకలిని, జీర్ణశక్తిని పెంచుతుంది. కీళ్ళనొప్పులకు, వాతానికి, రక్తపోటుకు, శరీరంలోని వేడిని తగ్గించడానికి నిమ్మరసం దోహదపడుతుంది.


క్యారెట్ జ్యూస్: దీనిలోని ప్రొ విటమిన్-ఎ, కెరొటిన్‌లు కాలేయానికి మేలు చేస్తాయి. బరువు తగ్గడానికి సాయపడుతుంది. కంటిచూపును మెరుగు పరుస్తుంది. పొట్టలో అల్సర్లను నివారిస్తుంది. ప్రధానంగా కాన్సర్ రాకుండా నిరోధిస్తుంది.


ముకుకుంబర్ జ్యూస్: అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. కిడ్నీలను శుభ్రపరిచి అధికంగా ఉండే రక్తపీడనాన్ని తగ్గిస్తుంది. అన్ని రకాల చర్మ సమస్యలను నివారించడానికి దోహదపడుతుంది. దోసకాయ రసం ఇది కీళ్ళ వ్యాధులను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది.


టొమాటో జ్యూస్: గుండె జబ్బులకు కారణమయ్యే హైపరాక్టివ్ ప్లేట్‌లెట్లను తగ్గిస్తుంది.  బీట్‌ రూట్ జ్యూస్: రక్తాన్ని వృద్ధిపరుస్తుంది. మంచి శక్తినిస్తుంది. దీనిలో ఉన్న బీటా పొట్టను, పేగులను శుభ్రం చేస్తుంది.


తోటకూర రసం: పచ్చి తోటకూర జ్యూస్‌ను అన్నం తినడానికి ముందు రోజుకి రెండుసార్లు తీసుకుంటే రక్తంలో చక్కెర మోతాదు అధికంగా ఉంటే తగ్గిస్తుంది.


ఉసిరి రసం: ఉసిరి జ్యూస్ రక్తంలో చక్కెర స్థాయిలను క్రమపరుస్తుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. కొవ్వు, వ్యర్థ పదార్థాలను, శరీరం నుండి బయటకు పంపబడుతుంది. శరీరంలోని వివిధ అవయవాలకు విశ్రాంతిని కలిగిస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: