దాల్చినచెక్క:   రోజులో ఒక్క చెంచాడు దాల్చినచెక్క పొడిని తీసుకున్నారంటే మీ అధిక బరువు క్రమంగా తగ్గిపోతుంది. ఆరోగ్యం, అందం కూడా మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు జరిపిన పలు పరిశోధనల్లో వెల్లడైంది. ఉపయోగాలు: దీనికి రక్తంలో గ్లూకోజ్‌ని తగ్గించే గుణం ఉంది. చెడు కొలెస్టరాల్‌ను 27శాతం వరకూ తగ్గించే శక్తి దీని సొంతం. టైప్ 2 మధుమేహ రోగులకు ఇది మంచి ప్రయోజనకారి. రక్తం గడ్డకుండా నిరోధిస్తుంది. దీన్ని మోతాదుకు మించి తీసుకోకూడదు. అలా తీసుకుంటే దీనిలో ఉండే కొమారిన్ అనే రసాయనం లివర్‌కి హాని చేస్తుంది.

లవంగాలు: లవంగాలు రుచి కోసం కూరలలో వేసుకునే ఒకరకమైన పోపుదినుసులు . వీటిలో వాసనేకాడు .. విలువైన పోషకాలు ఉన్నాయి. మొటిమలు, రాష్‌లు, దద్దుర్లు... వంటి చర్మ సమస్యలకూ లవంగనూనె ఉపయోగపడుతుంది. ఇది దోమల్నీ దరిచేరనివ్వదు. అద్భుత ఔషధం! లవంగాల్లోని యుజెనాల్‌ అనే రసాయనానికి అద్భుత ఔషధ, పోషక విలువలు ఉన్నాయి. యుజెనాల్‌ కఫానికి విరుగుడుగా పనిచేస్తుంది.

జీలకర్ర: జీలకర్రను మనం రోజువారీగా వాడుతూనే ఉంటాం. శరీరంలో ఏర్పడే తామర, తెల్లమచ్చలు, బొల్లి వంటివి ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా దెబ్బతీస్తాయి. అందుకనే ఇటువంటి చర్మ వ్యాధులను త్వరిత గతిన గమనించి, వాటి బారి నుండి బయటపడడం చాలా అవసరం. ఇందుకుగాను సులభమైన పెరటి వైద్యం జీలకర్ర - చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలర్జీకి జీలకర్ర గొప్ప ఔషధం. భోజనం తరువాత జీలకర్ర నమిలితే దంతాలు పుచ్చిపోకుండా ఉండటమే కాకుండా అజీర్తి, మలబద్దకం తగ్గిపోతాయి. జీలకర్ర,పసుపు, గంధం సమపాళ్లలో కలిపి మొత్తగా నూరి రోజూ ముఖానికి రాసుకుంటే అందమైన మార్పును మీరే గమనించవచ్చు.

యాలకులు: సువసన భరితమైన ఈ యాలకలు బరువు తగ్గించడంలో ఉపయోగిస్తారు. దీన్ని వివిధ రకాల వంటకాల్లో మంచి ఫ్లేవర్ కోసం వినియోగిస్తారు. ఇది శరీర జీవక్రియలను మెరుగు పరిచి, నోటి దుర్వాసను దూరం చేస్తుంది.

కుంకుమపువ్వు: కుంకుమ పువ్వులో ఉండే క్రోసిన్, సాఫరాల్, కెరెటనాయిడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్య విషయంలో కాకుండా సౌందర్య సాధనంగా, వంటలకు ఘుమఘుమలు అందించే పదార్థంగా కుంకుమపువ్వుకు మరేదీ సాటి రాదనేది వాస్తవం. అందుకే కుంకుమ పువ్వుకు నానాటికి క్రేజ్ పెరుగుతున్నది.

జాజికాయ: పాలలో జాజికాయ పొడిని కలుపుని తాగితే గుండెల్లో నొప్పి, దడ తగ్గుతాయి. గోరువెచ్చని పాలల్లో, చాలా స్వల్ప పరిమాణంలో ఈ పొడిని కలుపుకుని తాగితే చర్మ కాంతి పెరగడమే కాకుండా, చర్మం ముడతలు పడవు. జాజికాయను తాంబూలం దినుసులలో, వక్కపొడి తయారీలోనే కాకుండా ఔషధంగా కూడా వాడతారు. జాజికాయను పొడిగొట్టి, అతి స్వల్ప పరిమాణంలో వాడినట్లయితే, కొన్ని అనారోగ్యాలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. తాంబూలంలో జాజికాయను వేసుకుని సేవిస్తే నోటి దుర్వాసనను పోగొడుతుంది. పంటిమీద నలుపునూ, గారను తొలగించి, పళ్ళు మెరిసేలా చేస్తుంది. అధిక దాహాన్ని అరికడుతుంది. అలసటవల్ల వచ్చిన జ్వరాన్ని తగ్గిస్తుంది. మనస్సులోని ఆవేశాన్ని, ఆగ్రహాన్ని, ఉద్రేకాన్ని తగ్గించి మనస్సు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. మలేరియా జ్వరానికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. దగ్గు, జలుబు, కఫానికి ఔషధంగా పనిచేస్తుంది. మిరియాలు: రుచికి ఘాటుగానూ, కారంగానూ ఉంటాయి. మిరియాలు ఏదో ఒకరకంగా తీసుకోవడం వల్ల ఉదరంలో పేరుకున్న వాయువును వెలుపలికి నెట్టివేసే శక్తి మిరియాల సొంతం. శరీరంలో రక్తప్రసరణా వేగవంతం అవుతుంది. కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. వీటి వాడకం వల్ల శరీరంలో స్వేద ప్రక్రియ పెరుగుతుంది. మూత్రవిసర్జన సాఫీగా సాగుతుంది. కండర నొప్పులు దూరం... జలుబు, దగ్గు, ఆయాసంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే... గ్రాము మిరియాలు తీసుకుని దోరగా వేయించి పొడిచేసి.. చిటికెడు లవంగాల పొడి, పావుచెంచా వెల్లుల్లి మిశ్రమం తీసుకుని.. గ్లాసు నీటిలో మరిగించి వడకట్టి.. తేనెతో రోజూ రెండు మూడుసార్లు చొప్పున తీసుకోవాలి.  

ఇంగువ: ఇంగువ చాలా ఒగరుగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ప్రతి రోజు మనం వాడే వంటకాలలో ఇంగువను వాడుతుంటే అది కడుపుకు సంబంధించిన జబ్బులను నయం చేస్తుందంటున్నారు వైద్యులు. జీర్ణక్రియలో కాస్త ఇబ్బందిగా ఉండి ఆకలి సరిగా వేయకుంటే ఇంగువ చూర్ణాన్ని సేవిస్తే మీరు తిన్న ఆహారం బాగా జీర్ణమయ్యి ఆకలి బాగా వేస్తుంది.


అల్లం: అల్లానికి ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యం ఉంది. మూత్రవిసర్జన సాఫీగా జరిగేందుకు ఇది ఎంతగానో సహకరిస్తుంది. జీవక్రియలు సాఫీగా సాగేందుకు సైతం ఇది తోడ్పడుతుంది. ఉపయోగాలు: తీసుకున్న ఆహారంలో చెడును వెంటనే బయటకు నెట్టేస్తుంది. దాంతో బరువు పెరగకుండా ఉండడం సాధ్యమవుతుంది.

వొవేరియన్ క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేసే అల్లానికి ఉందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. జలుబు, మైగ్రేన్, ఉదయం పూట మగతగా ఉండే ఇబ్బందులను సైతం ఇది తొలగిస్తుంది. ఈ సుగంధ ద్రవ్యాల వల్ల బరువు తగ్గించడంతో పాటు అనేక రకాల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందుకే మన రోజు వారీ ఆహారంలో వీటిని ఉపయోగించడం ఎంతో అవసరం.


పసుపు: పసుపులో యాంటి ఆక్సిడెంట్ గుణాలు గల అత్యంత శక్తివంతమైన కుర్ కుమిన్ సమద్దిగా ఉంది. ఇది కణాల పెరుగదలకు దోహదం చేస్తుంది. కాబట్టి గాయాల అనంతరం కండరాలు కోలుకోవడానికి, కణజాలం పెరగడానికి తోడ్పడుతుంది. పసుపు నీరు, సున్నం, గుడ్డులోని తెల్ల సొన, వాముపొడి సమపాళ్లలో కలిపిన మిశ్రమాన్ని కండరాల నొప్పులకు, బెణుకులుకు పైపూత రాస్తే తగ్గిపోతాయి. ఒక చెంచా మెత్తని పసుపుతో పాలమీది మీగడ, గంధం పొడి,శనగపిండి కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే నిగనిగలాడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: