ఐబ్రోస్ తో బ్యూటీనెస్ ను పెంచుకోవాలంటే ఐబ్రోస్‌ను సున్నితంగా బ్రష్ చేయాలి. పొడవుగా, ఎక్కువ తక్కువులుగా ఉన్న హైర్ ను చిన్న సీజర్తో కట్ చేయాలి. బ్రష్‌ను పౌడర్లో అద్ది, ఐబ్రోస్‌కు మాచ్ అయ్యే విధంగా ఏవయినా స్పేస్ ఉన్నట్లయితే  స్మూత్ గా అద్దాలి. అలాగే బాడీ స్క్రబ్‍‌తో శరీరాన్ని స్మూత్ గా  ఐబ్రోస్ ను రబ్ చేయాలి. ఎందుకంటే, దీనివల్ల మృత కణాలు తొలగిపోయి చర్మం కాంతివంతమవుతుంది. అలాగే కనుబొమలకు వాడే మస్కారా రంగుతో సూట్ అయ్యే లిప్‌స్టిక్‌ను వాడడం వల్ల చూడటానికి అసహజంగా అనిపించదు.

Image result for eyebrows

మస్కారా బాగా డార్క్‌గా ఉంటే మద్యస్థంగా ఉండే లిప్ స్టిక్ వేసుకోవాలి. ఒక్కసారి అద్దంముందు నిలబడి ఐబ్రోస్‌‌కు, కనురెప్పలకు షేడ్‌లను వేసుకుని చూడండి. ఇలా చేయడంవల్ల వివిధ రకల షేడ్‌ల ద్వారా మీ అప్పియరెన్స్ ఎలా మారిపోతుందో మీకే అర్థమవుతుంది. ఒక్కొక్క రకమైన షేడ్ ఒక్కో రకమైన ఇంప్రెషన్‌ను కలుగజేస్తుంది. ఏ రకమైన ఐ షేడ్ మీకు మరింత హుందాతనాన్ని కలుగచేస్తుందో గమనించి వాటిని వాడటం మంచిది.

Image result for eyebrows

లైట్ షేడ్స్ ఉపయోగిస్తే నేత్రాలు మరింత అందంగా ఉండి, అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి. డార్క్ కలర్స్ వల్ల కళ్లు కొంచెం లోతుగా ఉన్నట్టు కనిపిస్తాయి. మస్కారాను మరీ ఎక్కువ లేయర్స్‌గా మేకప్ చేయకూడదు. దీనివల్ల అది ముద్దలాగా తయారై వున్నా అందాన్ని కూడా చెడగొడుతుంది. నిద్ర పోబోయే ముందుగా మస్కారాను, ఐ మేకప్‌నప వాష్ చేసుకోవటం మరవరాదు.


మీకు అందుబాటులో మేకప్ రిమూవర్ లేనట్టయితే మంచి కంపెనీ తయారుచేసిన వాజలిన్‌ను ఉపయోగించవచ్చు. పైన చెప్పిన జాగ్రత్తలను పాటించినట్లయితే, అందమైన మీనాల్లాంటి కళ్లు మీ సొంతమవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: