సహజమైన చర్మం కోసం..చర్మం నిగారింపు కోసం మనం ఎక్కడికి వెళ్ళకుండానే ఇంట్లో దొరికే పదార్ధాలతో పేస్ ప్యాక్ లు తయారు చేసుకోవచ్చు..ఈ పద్దతులు పాటిస్తేనే చర్మం పాడవకుండా ఎంతో కోమలంగా ఉంటుదని..ఇవే పద్ధతుల్ని పూర్వం నుంచీ పాటిస్తూనే వస్తున్నారు కానీ చాలా మందికి తయారుచేసుకోవడం తెలియక మరియు కాళీ లేకపోవడంతో రసాయనిక బ్యూటీ క్రీమ్స్ వైపు మొగ్గు చూపి చర్మాన్ని నాశనం చేసుకుంటున్నారు.

 Image result for natural face pack

  మీ చర్మ సంరక్షణకై అనేక రకాల పద్దతులు ఉన్నాయి..అవేమిటో మీరు ఒక తెలుసుకుని పాటించండి. రెండు స్పూన్స్ సెనగ పిండి..ఒక స్పూన్ పసుపు,తేనే కొద్దిగా పాలు తీసుకుని వీటన్నిటిని కలిపి ముద్దలా చేసుకుని ఆ మిశ్రమంలో రెండు చుక్కల నిమ్మరసం కలిపి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమం గట్టిపడక ముందే ముఖానికి పూసుకుని ఆరిపోయాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయాలి.. ఇలా వారానికి ఒక సారి కానీ రెండు సార్లు కానీ చేస్తుంటే ముఖం మీద ముడతలు పోతాయి.

 

ఒక బౌల్‌లో పెరుగు తీసుకుని దానికి కాస్త తేనెను జత చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదినిమిషాల తర్వాత శుభ్రపరచుకోవాలి. దీనివల్ల చక్కని ఫలితం ఉంటుంది..అలాగే ఒక గిన్నెలు కొంచం తేనే తీసుకుని దానికి నారింజ రసం కలపాలి..ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తరువాత శుభ్రపరిస్తే చర్మం అత్యంత సున్నితంగా తయారవుతుంది.

 Related image

కోడి గుడ్డులో ఉండే పచ్చని సొనని ఒక బౌల్ లోకి తీసుకుని అందులో ఆలివ్ ఆయిల్..నారింజ రసం ,కొంచం తేనే కలిపి ఈ మిశ్రమం లో కొన్ని రోజ్ వాటర్ నిమ్మ చుక్కలు వేసి పేస్ ప్యాక్ లా పట్టిస్త్రే అవి ఈ ప్యాక్‌ను ప్రతిరోజూ ఉదయం స్నానానికి పదిహేను నిమిషాల ముందు పట్టించుకోవాలి.ఇలా చేయడం వలన చర్మం జిడ్డు బారకుండ పొడిగాను మృదువుగా తయారవుతుంది.

.

 


మరింత సమాచారం తెలుసుకోండి: