ప్రతీ కాలంలో సహజంగా అందరికీ కలిగే ఇబ్బంది చుండ్రు..శీతాకాలంలో అయితే ఈ సమస్య మరీ అధికంగా ఉంటుంది. చాలా మంది ఈ చుండ్రు సమస్యతో సతమతమవుతూ ఉంటారు..ఈ చుండ్రు వ్యాధి వలన జుట్టు రాలిపోవడం..జుట్టు ఎదగక పోవడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి..చుండ్రు అనేది ఒక వైరస్ లాంటిది..ఇది ఒకరి నుంచీ మరొకరికి పాకుతుంది..చుండ్రు ఉన్న వ్యక్తి వాడిన దువ్వెన మరొకరు వాడినా,లేదా తుండ్లు వాడినా ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది..చుండ్రు తలమీద చర్మం మీద మృత చర్మం పేరుకు పోయి ఉంటుంది..ఈ చర్మం పోతేనే గానీ మీ సమస్య కి పరిష్కారం దొరకదు..

 Image result for dandruff lemon

చాలా మంది చుండ్రు సమస్యనుంచీ తప్పించుకోవడానికి గుండు చేయించుకుంటారు..అలాంటి వాళ్ళ కోసం కొన్ని పద్దతులు ఉన్నాయి వీటిని పాటిస్తే గుండు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు..అంతేకాదు జుట్టు..బలంగా తయారయ్యి  నిగారిస్తుంది.

ఒక చిన్న కప్పు మెంతిగింజలను ఓ రోజంతా నీటిలో నానబెట్టి..ఆ గింజలను పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ పేస్టుతో తలమీద చర్మంపై బాగా మసాజ్‌ చేసుకుని.. ఓ 30 నిమిషాల తరువాత తలారా స్నానం గోరు వెచ్చటి నీటితో చేస్తే చుండ్రు పొట్టి ఆగిపోయి..చుండ్రుకి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.

Image result for dandruff lemon
కొంచం నిమ్మరసం తీసుకుని దానిలో కొంచం వెనిగర్ కలిపి ఆ మిశ్రమాన్ని తలకి పట్టించాలి..20 నిమిషాలు తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చుండు సమస్య పరిష్కారం అవ్వడమే కాకుండా..జుట్టు మెరుస్తుంది కూడా.. అలాగే కొన్ని వేప ఆకులు రుబ్బి, ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి జుట్టుకు రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో  కడ‌గాలి. తరువాత కుంకుడు కాయలతో స్నానం చేసినా సరే చుండ్రు పోతుంది.

 

ఒక నిమ్మకాయని తీసుకుని దానిని సగానికి కోసి తలమీద ఉండే చర్మం తగిలే విధంగా మెల్లగా రుద్దుతూ ఉండాలి ఇలా చేయడం వలన నిమ్మరసం తలమీద ఉండే చుండ్రు మృత చర్మం మీద ప్రభావం చూపి ఆ మృత చర్మాన్ని చేదిస్తుంది..ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చాలు చుండ్రు సమస్య రానే రాదు..అంటే కాదు స్నానం చేసే ముందు గ్రీన్ టీ ని తలకి పట్టించి మర్దనా చేసి ఆ తరువాత స్నానం చేస్తే జుట్టు చాలా ధృడంగా తయారవుతుంది.
Image result for dandruff lemon


మరింత సమాచారం తెలుసుకోండి: