1 కొబ్బరి నూనె:నూనెను పట్టించి కుదుళ్ళ వరకూ మర్దన చేసుకోవాలి దీని వల్ల వెంట్రుకలకు రక్త ప్రసరణ బాగా జరిగి వెంట్రుకలు బలంగా పెరుగుతాయి..

2.ఉసిరి : జుట్టు రాలే సమస్యనే కాదు, చుండ్రుని కూడా నివారిస్తుంది. తలలో ఇన్‌ఫెక్షన్‌ ఉంటే తగ్గేలా చూస్తుంది. ఉసిరి పొడిని కలిపి తలకు పూతలా వేసుకొని కాసేపయ్యాక కడిగేసుకుంటే సరిపోతుంది.

3.పెరుగు :జుట్టుని మెరిపించడంతో పాటూ ఒత్తుగా పెరిగేలా చేస్తుంది పెరుగు. 

4.గోరింటాకు :పదిహేను రోజులకోసారి గోరింటాకు పొడిలో కొద్దిగా నిమ్మరసం, పెరుగూ కలిపి తలకు పూతలా వేసుకోవాలి. అరగంటయ్యాక తలస్నానం చేయాలి.

5.కొబ్బరిపాలు:కొన్నిసార్లు జుట్టు చిట్లిపోతుంది. పొడి బారడం, తలంతా దురదపెట్టడం వంటి సమస్యలూ తలెత్తుతాయి. వాటిని నివారించాలంటే తలకు కొబ్బరి పాలు రాసుకుని కాసేపయ్యాక కడిగేసుకోవాలి.

6.మందారం :మందారం పువ్వుని కాగేనూనేలో వేసి చల్లారిన తర్వాత జుట్టుకు పట్టించుకోవాలి...జుట్టు ఎదుగుదలకు పోషకపదార్ధాలు,ప్రోటిన్స్ అవసరం కాబట్టి బలమైన పోషక పదార్ధాలైన పాలు,పళ్ళరసాలును ఎక్కువగా తీసుకోవాలి..ఆందోళనలకు గురవడం వల్లకూడా జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోండి

మరింత సమాచారం తెలుసుకోండి: