నువ్వుల నూనె చాలా మంది ఈ నూనెను దీపారాదన కోసం వాడే నూనేగానే చూస్తారు. కానీ ఈ నూనెలో ఎన్నో పోషక విలువలతో పాటు, చర్మాన్ని నిగారింప చేసే తత్వం ఉంటుందని చాలా మందికి తెలియదు.ఎన్నో చర్మ సంభందిత  వ్యాధులకి, జుట్టు రాలకుండా చేయడంలో నువ్వుల నూనె చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది. జిడ్డు  ,పొడి చర్మ కలిగి ఉన్నవారు నువ్వుల నూనె వాడటం వలన ఉత్తమమైన పరిష్కారాలని పొందుతారు.

 Image result for sesame seeds

నువ్వుల నూనెని మార్కెట్ లో దొరికే ఎన్నో సౌదర్య సాధనాలలో ఉపయోగిస్తారు కూడా. ఎంతో మంది మహిళలు తమ పెదాలు ఎంతో మృదువుగా ఉండటం కోసం ఎండ వేడిమి నుంచీ కాపాడుకోవడం కోసం నువ్వుల నూనెని ఉపయోగిస్తారు. మరి నువ్వుల నూనెతో మీ పెదాలని మెత్తగా ఎంతో మృదువుగా ఎలా చేసుకోవాలో చూద్దాం.

 Image result for sesame seeds oil

నువ్వుల నూనె లో ఉండే సహజసిద్దమైన పోషకాలు మీ పెదాలకి మంచి టోన్ ఇవ్వడంలో సహాయపడుతాయి, దాంతో మీ పెదాలు సహజరంగుని పొంది, ప్రకాశవంతంగా ఉంటాయి. ప్రతీ రోజు నువ్వుల నూనెని పెదాలకి రాసుకోవడం ద్వారా పెదాలు మృదువుగా, మంచి రంగుతో ఆరోగ్యంగా తయారవుతాయని ఆయుర్వేద నిపుణులు పూర్వం నుంచీ చెప్తున్నదే. అయితే ఈ నూనెని ఏ విధంగా పెదాలకి రాసుకోవాలంటే..

 Image result for sesame seeds for lips

ముందుగా కొన్ని బీట్రూట్ ముక్కలని కత్తిరించి ఎండలో ఆరబెట్టాలి. ఎండిన ముక్కలని పొడి చేసి గ్రైండ్ చేసుకోవాలి.  ఆ తరువాత ఈ పొడిని చిటికెడు తీసుకుని, అందులో ఒక చెంచా నువ్వుల నూనెకు కలపాలి. కలపగా వచ్చిన మిశ్రమాన్ని పెదాలపై అప్లై చేసి 10 నిముషాలు ఆరబెట్టాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారం రోజుల పాటు రోజు చేయడం వలన మీ పెదాల మార్పుని గమనించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: