పుదీనాను మ‌నం ఎక్కువ‌గా ప‌లు వంట‌ల్లో వేస్తుంటాం. దీని వ‌ల్ల ఆయా వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి.  అయితే పుదీనా మ‌న‌కు ఆహార ప‌దార్థంగానే కాక మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను, చ‌ర్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసే ఔష‌ధంగా కూడా ప‌నిచేస్తుంది. ముఖ్యంగా పుదీనా మరియు దాని సారాన్ని అందాన్ని మెరుగుపరిచే వివిధ రకాల ఉత్పత్తులలో వాడుతున్నారు. అలాగే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ నిజానికి కొంత మేర మనకు ఆందోళన కలిగించే అంశంగా ఉంటుంది. 


అయితే పుదీనా వీటిని నివారించ‌డానికి ఎంతో ఉప‌యోగ‌పడుతుంది. పుదీనా చర్మం ముడతలు పడకుండా, త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా చూడటంలో సహాయపడుతుంది. మన అందాన్ని మెరుగుపరచటంలో పుదీనా పాత్ర గురించి తెలుసుకుందాం.. 


- పుదీనా ఆకులు మరియు 2 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్.. ఈ రెండిటిని మిక్స్ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ఫేస్‌కు అప్లై చేసి 15 నిమిషాల త‌ర్వాత క్లిన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఫేస్ గ్లో గా మారుతుంది.


- పుదీనా జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. మీ జుట్టు కోసం రోజు వాడే నూనెకు కొన్ని చుక్కల పుదీనా నూనె కూడా వాడి వెంట్రుకలకు అప్లై చేయటం వలన రక్త ప్రసరణ మెరుగుపడి, జుట్టు పెరుగుదల కూడా బాగుటుంది.


- జిడ్డు చర్మాన్ని కలిగి ఉన్నారా? అయితే ఆపిల్ సైడర్ కు కొద్దిగా పుదీనా నూనెను కలిపి చర్మాన్ని అప్లై చేయండి. ఈ మిశ్రమం చర్మం యొక్క pH స్థాయిలను పెంచి, చర్మంలో ఉత్పత్తి చెందే అధిక నూనెలను తగ్గిస్తుంది.


- తాజా పుదీనా ఆకులు కొన్ని చుక్కల నిమ్మరసం వేసి బ్లెండర్లో పేస్ట్ చేసుకోవాలి. ఆ మిశ్ర‌మాన్ని ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ళ్ల కింద ఉన్న డార్క్ స్పార్ట్స్‌ మాయం అవుతాయి.


- పుదీనా ఆకులు గ్రైండ్‌ చేసి ముఖానికి ఫ్యాక్‌లా వేసుకుని కొంత స‌మ‌యం త‌ర్వాత వాష్ చేసుకోవాలి. దీనివల్ల చర్మం మరింత తాజాగా, ఆరోగ్యంగా మారుతుందని నమ్ముతారు.


- పుదీనా పేస్ట్‌లో కొంచెం శెన‌గ‌పిండి మ‌రియు చిటికెడు పసుపు వేసి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం కాంతివంతంగా చేయడంలో సహాయం చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: