స‌హ‌జంగా అంద‌రూ త‌మ ఎప్పుడూ అందంగా, య‌వ్వ‌నంగా క‌నిపించాల‌ని అంద‌రూ అనుకుంటారు. కానీ అది కొంద‌రికే సాధ్యం అవుతుంది. ఎక్కువ‌గా 30 ఏళ్లు దాట‌గానే మన ముఖం ముడ‌త‌లు వ‌స్తుంటాయి. అయితే ఇది మ‌నం తీసుకునే ఆహారం వ‌ల్ల మ‌రియు మ‌న జీవ‌న‌శైలి వ‌ల్ల ఇలా వీటికి ఎన్నో కార‌ణాల‌ని చెప్ప‌వ‌చ్చు. ముడ‌త‌లు రావ‌డంతో వృద్ధాప్య ఛాయ‌లు క‌నిపిస్తాయి. అయితే మీ ముఖం అందంగా, మృదువుగా, య‌వ్వ‌నంగా ఉంటాలంటే కొన్ని చిట్కాల‌ను వాడితే స‌రిపోతుంది. మ‌రి అవేంటో ఇప్పుడు చూద్దాం.. ఓ లుక్కేయండి..


- అర‌టి పండు బాగా పేస్ట్ చేసి ఫేస్‌కు అప్లై చేసుకోవాలి. అర‌టి పండులో ఉన్న విటమిన్స్, మిన‌రల్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ వ‌ల్ల ముఖంలో ఉన్న ముడ‌త‌లు తొల‌గిపోతాయి.


- ఆలివ్ ఆయిల్ మ‌రియు తేనె మిక్స్ చేసి ఫేస్ రాసుకోవాలి. ఇలా చేడ‌యం వ‌ల్ల ముడ‌త‌లు రాకుండా అడ్డుకుంటుంది. ముఖం కూడా అందంగా మారుతుంది. 


- బొప్పాయి తీసుకుని బాగా పేస్ట్ చేసి అందులో కొంచెం తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపి మిక్స్ చేపి ఫేస్‌కు అప్లై చేసుకోవాలి. ఇలా చేడ‌యం వ‌ల్ల బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ , పెక్టిన్ చర్మంలో ముడతను నివారించడంలో స‌హాయ‌ప‌డుతుంది.


- రోస్ వాట‌ర్‌లో కొంచెం నిమ్మ‌ర‌సం వేసి ఫేస్‌కు అప్లై చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై ముడ‌త‌లను నివారించి, అందంగా క‌నిపించేలా చేస్తోంది.


- అలోవెర జెల్ ముఖంపై ముడ‌త‌ల‌కు మంచి రెమెడీగా ప‌ని చేస్తుంది. అలోవెర తీసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా చేయ‌డంతో ముడ‌త‌లు పోయి, కాంతివంతంగా మారుతుంది.


- మెంతుల‌ను నాన‌బెట్టి బాగా ప్లేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ఫేస్‌కు అప్లై చేసి కొంత స‌మ‌యం త‌ర్వాత క్లీన్  చేసుకోవాలి. ఇలా చేయ‌డం కూడా ముడ‌త‌ల‌ను నివారిస్తుంది.


- నిమ్మ‌ర‌సంలో ముడ‌త‌ల‌కు బాగా చెక్ పెట్ట‌వ‌చ్చు. నిమ్మ‌ర‌సాన్ని తీసుకుని ముఖానికి బాగా అప్లై చేసి మ‌ర్ద‌నా చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై ముడ‌త‌లు పోయి కాంతివంతంగా క‌నిపిస్తుంది.


- ఎగ్‌వైట్ తీసుకుని ముఖానికి బాగా అప్లై చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎగ్‌వైట్‌లో ఉన్న ప్రోటీన్ వ‌ల్ల ముడ‌త‌లు రాకుండా చూస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: