సహజ అందానికి మనచుట్టూ ప్రకృతిలో ఉండే చెట్లో , పూలో ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. రోజు వారి మనం వాడుకునే కూరగాయలు సైతం అందం రెట్టింపు చేయడంలో కీలకంగా ఉంటాయి. అయితే బంగాళదుంప సైతం అందాన్ని రెట్టింపు చేయడంలో ఉపయోగపడుతుందనే విషయం చాలా మందికి తెలియదు. బంగాళదుంప కేవలం రుచికి మాత్రమే కాదు, ముఖంపై ఏర్పడే నల్ల మచ్చలని తొలగించడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. మరి  బంగాళదుంపని ఉపయోగించి నల్లమచ్చలకి ఎలా చెక్ పెట్టచ్చో ఇప్పుడు చూద్దాం..

 Image result for potato skin care

పచ్చిగా ఉండే బంగాల దుంపలో ఉండే కొన్ని ఎంజైమ్స్ అధికంగా వచ్చే మెలినిన్ నివారించడంలో ఉపయోగ పడుతుంది. దాంతో చర్మంపై ఉండే మచ్చలు త్వరితగతిన పోవడంలో సహాయపడుతుంది. అయితే మచ్చలని తొలగించడానికి బంగాల దుంపని ఎలా ఉపయోగించాలంటే.

 Image result for potato skin care

ముందుగా ఓ పచ్చి బంగాళదుంప తీసుకుని దానిని రెండు ముక్కలుగా చేయాలి. ఈ ముక్కల పై భాగంలో కొంచం నీళ్ళు చిలకరించి తడి చేయాలి. ఐదు నిమిషాలు అయిన తరువాత కోసిన  బంగాళదుంప ముక్కలని తీసుకుని మచ్చలు ఉన్న ప్రదేశంలో గుండ్రంగా రుద్దాలి. ఇలా రోజుకి రెండు సార్లు వారానికి మూడు రోజులు చేయటంవలన తప్పకుండ నల్లమచ్చలని ముఖంపై నుంచీ తీసేయచ్చు. కేవలం నల్ల మచ్చలు పోవడమే కాకుండా చర్మం నాజూకుగా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: