ఉల్లిపాయ లేని జీవితం వ్యర్దం అంటూ ఓ సినిమా కవి అన్నాడు. నిజమే ఉల్లిలేని కూర లేదు, మనిషి కి ఉల్లి ఓ నిత్యవసర వస్తువు అయ్యిపోయింది. ఆరోగ్య సంరక్షణ లో ఉల్లి ఓ భాగం అయ్యింది. వంటింట్లో మాత్రమే కాదు ఆరోగ్య సంరక్షలో సైతం ఉపయోగించే ఉల్లి సౌందర్య సౌకర్యార్ధం వాడుతారు అనేది చాలా మందికి తెలియదు. అందుకే ఉల్లి ఎలాంటి సౌందర్య సాధనంగా ఉపయోగ పడుతుందో ఇప్పుడు చూద్దాం.

Image result for pigmentation

ఉల్లిపాయ ముఖ్యంగా బ్లాక్ పిగ్మేంటేషన్ తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. బ్లాక్ పిగ్మేంటేషన్ వలన ముఖం నల్లగా మారిపోతుంది. అందమైన ముఖం కలిగిన వారిని ఈ సమస్య ఉన్నప్పుడు చూడాలంటే ఎంతో ఇబ్బంది పడుతాం. అయితే ఉల్లిపాయ మాత్రమే ఈ బ్లాక్ పిగ్మేంటేషన్ కి చెక్ పెట్టగలదు. అందుకే ఏమి చేయాలంటే. ఉల్లి రసం కొద్దిగా తీసుకుని అందులో కొంచం స్వచ్చమైన శనగపిండి, కొంచం మీగడ కలిపి బాగా ముఖంపై అప్ల్లై చేయాలి. గంవరకూ బాగా ఆరనిచ్చి  చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి. ఇలా వారానికి రెండు రోజులు చేస్తే తప్పకుండా  బ్లాక్ పిగ్మేంటేషన్ తగ్గి ముఖం తెల్లగా మారుతుంది.

 Image result for pigmentation onion face

అంతేకాదు చాలా మందికి చర్మం పొడిబారిపోయినట్టుగా నిర్జీవంగా మారుతుంది. అలాంటప్పుడు ఉల్లిపాయని మెత్తగా చేసుకుని ఒక గుడ్డలో వేసి ఒక గిన్నెలోకి ఉల్లి రసాన్ని బయటకి తీయాలి. ఈ రసాన్ని నేరుగా ముఖానికి పట్టిచాలి. ఉల్లిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు , విటమిన్లు చర్మాన్ని తేమగా ఉంచడమే కాకుండా ముఖం మెరిసేలా చేస్తుంది.  

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: