అమ్మాయి అంటే అందం...అందం అంటే అమ్మాయి.. చాలా మంది ఆడవాళ్లు అందంగా కనిపించాలని తెగ ఆరాట పడుతున్నారు.నలుగురిలో నేను అందగత్తె అని అనిపించుకోవడానికి ఏవేవో చేస్తుంటారు.. గొప్పలకు పోయి తిప్పలు పడటం అంటే ఇదే అన్నట్లు కష్టపడుతూ ఉంటారు.. అయిన ఏ ప్రయోజనం లేకుండా పోవడంతో చాలా ఇబ్బందులు పడుతుంటారు..అయితే కెమికల్స్ వాడటం వల్ల, ఇంకా అంద విహీనంగా మారుతుంటారు.. దానితో బాధపడుతుంటారు.. ఇకపోతే న్యాచురల్ గ్యాస్ దొరికే ఇంట్లో వాటితో అందాన్ని పెంచుకోవడం ఎలానో తెలుసుకుందాము..

పసుపు, శనగపిండి:
పసుపు , శనగపిండి.. పసుపు మంచి యాంటీబయాటిక్ అందుకే ఈ పసుపును వంటింటి రారాజు అంటారు.. చర్మంలోని మృతకణాలను తొలగించడంలో ఈ పసుపు మంచి మెడిసిన్.. అంతేకాకుండా చర్మకాంతిని కూడా మెరుగు పడేలా చేస్తుంది.. ఇంకా శనగపిండి విషయానికొస్తే చర్మానికి మృదుతత్వాన్ని కలిగిస్తుంది.. ఇకపోతే ఈ రెండింటిని కలిపి పేస్ ప్యాక్ వేసుకుంటే ముఖం అందంగానూ మృదువుగాను తయారవుతుంది.. ఒక  స్పూన్ శనగపిండిలో, కొద్దిగా పసుపు , రోజ్ వాటర్ వేసి బాగా కలిపి, ముఖానికి, మెడకు రాసుకోవాలి అంతే ముఖం కాంతిని సంతరించుకుంటుంది. 

కొబ్బరి పాలు , గంధం..
కొబ్బరి పాలు మృదుతత్వాన్ని కలిగిస్తుంది.. అందుకే  కొబ్బరి పాలను కురుల సంరక్షణకు కూడా వాడుతుంటారు. గంధం చర్మానికి నిగారింపుతో పాటుగా, మృతకణాలను కూడా తొలగిస్తుంది. అందుకే ఈ రెండింటిని కలిపి ముఖానికి ఫెస్ ప్యాక్ వేసుకుంటే అందం మరింత అందంగా తయారవుతాయి. ఒక స్పూన్ గంధంలో, కొద్దిగా కొబ్బరి పాలు వేసుకొని ముఖానికి పట్టించి 20 నిమిషాలు ఉంచి గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. అంతే మెరిసే చర్మం మీ సొంతం. 

పెరుగు, టమాటా :
పెరుగులో ఎన్నో సహజ గుణాలున్నాయి.  పెరుగు మృదుత్వంలో ఒక్క ముందుంటుంది. తింటే ఎంత చల్లగా ఉంటె ఉంటుందో చర్మానికి కూడా అంతే మేలు చేస్తుంది.  ఒక స్పూన్ టమోటా గుజ్జులో, కొద్దిగా పెరుగు వేసి బాగా కలిపి ముఖానికి రాసుకొని 10 నిమిషాలు అయ్యాక కడిగేసుకోవాలి. 

బియ్యపు పిండి, పసుపు :
బియ్యపు పిండి చర్మలోని మృతకణాలను తొలగించడమే కాదు, చర్మానికి బాగా స్రబ్ చేస్తుంది. పసుపు చర్మానికి మెరుగును తీసుకొస్తుంది. ఈ రెండింటిని సమపాళ్లలో తీసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి . పేస్ కి స్రబ్ చేస్తుంది. దానితో చర్మం మెరుపు కూడా వస్తుంది. 

రోజ్ వాటర్ :
రోజ్ వాటర్ అనేది చర్మానికి నిగారింపు ని తీసుకొస్తుంది. డల్ స్కిన్ ను మెరిసేలా చేస్తుంది. ముఖానికి కాటన్ బాల్ తో ముఖానికి బాగా బాగా అప్లై చేసుకోవాలి. అలా చేస్తే చర్మం కాంతి వంతంగా మారుతుంది. 
చూసారుగా వంటింట్లో దొరికే వాటితో అందాన్ని ఎలా మెరుగు పరుచుకోవాచ్చునో .. ఈ టిప్స్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: