అందం అంటే ఆడోళ్ళకేనా మగాళ్ళు అందంగా ఉండరా అంటూ ఆ మధ్య ఓ కుర్రాడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అందరిని ఆకట్టుకున్నాడు. నిజమే అందం అంటే ఆడవారికి మాత్రమే సొంతమా అంటూ కామెంట్స్ మీద కామెంట్స్ పెడుతూ మగజాతి గొంతు కలిసింది. అయితే మరి మగవాళ్ళు అందం కాపాడుకోవాలంటే చాలా కష్టం బాసు అంటారు ఎందుకంటే, మగాళ్ళు ఆడవారు తీసుకున్నట్లుగా జాగ్రత్తలు పాటించలేరట. వారికి ఉన్న కొన్ని కొన్ని అలావాట్లు దూరం చేసుకుంటే అందం ఆడవారికి మాత్రమే సొంతం కాదని నిరూపించుకోవచ్చు అంటున్నారు. ఇంతకీ ఏమిటా జాగ్రత్తలు...

 Image result for mens beauty tips

మగవారు పొడుకునే  సమయంలో సరైన పొజిషన్ లో పడుకోవాలి. ముఖ్యంగా చాలా మంది వెల్లకిలా పొడుకుంటారు ఆ సమయంలో కడుపు లోపలి వత్తుతుంది. అదే క్రమంలో ముఖం దిండుకు ఒత్తుకోవడం ద్వారా చర్మంపై ముడుతలు ఏర్పడుతాయి. అంతేకాదు ముఖ రూపులో కూడా మార్పులు ఏర్పడుతాయట.అందుకే పడుకునే ముందు ముఖాన్ని దిండుకు అద్ది పడుకోవద్దు.

 Image result for avoid smoke mens beauty

పొగ త్రాగే వారికి అందం చాలా దూరంలో ఉంటుంది. పొగ త్రాగే వారిని ఒక్క సారి పరిశీలిస్తే ముఖం అంతా అందవిహీనంగా ఉంటుంది. అంతేకాదు ముఖంపై గగ్గురు గగ్గురుగా, పొడిబారి ఉంటుంది. తెల్లగా ఉండే వారు సైతం నల్లగా మారిపోతారు. నోటి దుర్వాసన కూడా వివరీతమా వస్తుంది. అనారోగ్యాలు కూడా ఆవరిస్తాయి. సో పొగ త్రాగడం పక్కన పెడితే అండంతో పాటు ఆరోగ్యం కూడా మీసొంతం అవుతుంది.

 Image result for mens beauty tips

చుండ్రు సాధ్యమైనంత వరకూ రాకుండా చూసుకోవడం మంచిది. చుండ్రు ఉండటం వలన అది ముఖంపై పడి ముఖంపై మొటిమలు రావడం జరుగుతుంది. మచ్చలు కూడా ఏర్పడి అందవిహీనంగా తయారవుతుంది. సో చుండ్రు పోగొట్టే ఎంటువంటి పద్దతులని అయినా మీరు ఆచరించి జాగ్రత్త పడచ్చు. అలాగే  ముఖంపై మెరుపు మెరవాలంటే  ఆలివ్ ఆయిల్ మగవారికి ఎంతో చక్కగా ఉపయోగ పడుతుంది. కొంచం ఆలివ్ ఆయిల్ తీసుకుని అందులో కొంచం పంచదార వేసి, ఉప్పుని కూడా కలిపి ముఖానికి మర్దనా చేసుకుంటే చాలా మంచిది. క్లీన్ షేవ్ చేసుకున్న తరువాత కూడా ఈ పద్దతిని ఫాలో అవ్వచ్చు. అంతేకాదు వీలైనంత ఎక్కువ సేపు నిద్రపోవాడానికి, ఎక్కువగా మంచి నీళ్ళు త్రాగడానికి ప్రయత్నం చేయండి ఇవి మీ అందాన్ని మరింత మెరుగ్గా ఉంచుతాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: